కనకపుర నుంచి కాంగ్రెస్ చీఫ్ నామినేషన్.. మాజీ సీఎం చేరికతో పార్టీలో మరింత ఉత్సాహం

by Harish |   ( Updated:2023-04-17 14:22:15.0  )
కనకపుర నుంచి కాంగ్రెస్ చీఫ్ నామినేషన్.. మాజీ సీఎం చేరికతో పార్టీలో మరింత ఉత్సాహం
X

బెంగళూరు: కర్ణాటక‌లో నామినేషన్ల పర్వం కొనసాగుతోంది. సోమవారం కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర చీఫ్ డీకే శివకుమార్ కనకపుర నియోజకవర్గం నుంచి తన నామినేషన్ దాఖలు చేశారు. 224 అసెంబ్లీ స్థానాలున్న రాష్ట్రంలో తన పార్టీ 150 సీట్లు గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. నామినేషన్ దాఖలు చేసే ముందు ఆయన తన నియోజకవర్గంలో రోడ్ షో నిర్వహించారు. రాష్ట్రంలో అవినీతి ప్రభుత్వాన్ని పడగొట్టి అధికారంలోకి వస్తామని అన్నారు. కర్ణాటక ప్రజల ఆశీస్సులతో నామినేషన్ దాఖలు చేసినట్లు చెప్పారు. రాష్ట్రంలో అధికారంలోకి వస్తామని విశ్వసిస్తున్నట్లు చెప్పారు. మరోవైపు బీజేపీ నుంచి పలువురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ చేరాలని చూస్తున్నారని, అయితే రాజకీయ ఖాళీలు లేవని చెప్పారు. అయితే కర్ణాటక మాజీ సీఎం జగదీష్ షెట్టర్ చేరిక పార్టీకి మరింత ఉత్సాహాన్ని ఇస్తుందని చెప్పారు.

Advertisement

Next Story

Most Viewed