- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Karnataka: వెన్నుపోటు పొడవను.. డీకే శివకుమార్ సంచలన వ్యాఖ్యలు
దిశ, డైనమిక్ బ్యూరో: కర్ణాటక సీఎం పోస్ట్ పై ఉత్కంఠ కొనసాగుతోంది. ముఖ్యమంత్రి పదవి విషయంలో సిద్దరామయ్య, డీకే శివకుమార్‌లు ఇద్దరు పట్టుదలతో ఉండటంతో ఈ వ్యవహారం కాంగ్రెస్ అధిష్టానానికి తలనొప్పి వ్యవహారంగా మారింది. ఈ నేపథ్యంలో మంగళవారం డీకే శివకుమార్ అధిష్టానంతో చర్చించేందుకు మంగళవారం ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు.
ఈ నేపథ్యంలో మీడియాతో మాట్లాడిన ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను వెన్నుపోటు పొడవనని, బ్లాక్ మెయిల్ పాలిటిక్స్ చేయనని అన్నారు. సీఎం ఎంపిక విషయంలో అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా అందుకు తాను కట్టుబడి ఉంటానని స్పష్టం చేశారు. తాను ఎవరికి నచ్చినా నచ్చకపోయినా బాధ్యతతో వ్యవహరిస్తానని చెప్పారు. తాము 135 సీట్లు గెలిచామని ఎవరినీ విడగొట్టాలని అనుకోవడం లేదన్నారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కర్ణాటకలో కాంగ్రెస్‌కు 20 సీట్లు తేవడమే తమ ముందున్న సవాల్ అని చెప్పారు.
కాగా ఇప్పటికే అధిష్టానంతో సిద్ధరామయ్య చర్చలు ముగియగా ఇవాళ డీకేతో పార్టీ పెద్దలు ఎలాంటి విషయాలు చర్చించబోతున్నారనేది ఆసక్తిగా మారింది. ఇవాళ ఇద్దరితో మరోసారి భేటీ కాబోతున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే సీఎం విషయంలో డైలామా కొనసాగించడం పార్టీకి మంచిది కాదని భావిస్తున్న అధిష్టానం ఇవాళ సాయంత్రం లోపు ఏదో ఓ నిర్ణయాన్ని ఫైనల్ చేయబోతోందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కర్ణాటక కింగ్ సిద్ధరామయ్య లేక డీకే శివ కుమారా అనేది ఉత్కంఠ రేపుతోంది