- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
ఇడ్లీల తయారీలో ప్లాస్టిక్

- 52 హోటల్స్‌లో పాలిథిన్ షీట్ల వాడకం
- క్యాన్సర్‌కు దారితీసే అవకాశం
- నిషేధించిన కర్ణాటక
దిశ, నేషనల్ బ్యూరో: ఇడ్లీల తయారీలో ప్లాస్టిక్‌ను వాడటంపై కర్ణాటక ప్రభుత్వం నిషేధం విధించింది. కర్ణాటకలోని పలు హోటల్స్ ఇడ్లీ పాత్రల్లో పాలిథిన్ షీట్లను ఉపయోగిస్తున్నట్లు తెలిసిందని, దీని వల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని కర్ణాటక హెల్త్ మినిస్టర్ దినేశ్ గుండు రావు హెచ్చరించారు. ఇకపై ఇడ్లీ తయారీలో ప్లాస్టిక్‌ను వాడకుండా నిషేధం విధించినట్లు ఆయన తెలిపారు. ఇటీవల కర్ణాటక ఫుడ్ సేఫ్టీ డిపార్ట్‌మెంట్ పలు హోటల్స్‌పై దాడులు చేసింది. ఈ సమయంలో 52 హోటల్స్ ఇడ్లీలను తయారు చేయడానికి ప్లాస్టిక్ షీట్లను వాడుతున్నట్లు గుర్తించారు. పలు హోటల్స్ నుంచి 251 ఇడ్లీ శాంపిల్స్‌ను తీసి ల్యాబ్‌లో పరీక్షించగా.. ప్లాస్టిక్ ఆనవాళ్లు కనపడ్డాయి. ఇడ్లీ తయారీకి సాంప్రదాయంగా వినియోగించే వస్త్రాలకు బదులు వాడి పారేసే ప్లాస్టిక్ షీట్లను ఉపయోగిస్తున్నట్లు తేలింది. 251 శాంపిల్స్ పరీక్షించగా.. 52 శాంపిల్స్‌లో ప్లాస్టిక్ ఉన్నట్లు నిర్థారణ అయ్యింది. ఇవి క్యాన్సర్ కారకాలని, ఇాంటి ఇడ్లీలను తింటే ఆరోగ్యంపై తీవ్ర దుష్ప్రభావాలు చూపిస్తాయని అధికారులు చెప్పారు. త్వరలోనే ఈ హోటల్స్‌కు నోటీసులు పంపి చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. అలాగే రాష్ట్ర మంతటా ఆహార పదార్థాల తయారీలో ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా నిషేధిస్తూ కర్ణాటక ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.