హృదయం చెలించే ఘటన.. జవాన్ అంత్యక్రియల్లో భార్య చేసిన పనికి అంతా కన్నీటిపర్యంతం!

by Satheesh |
హృదయం చెలించే ఘటన.. జవాన్ అంత్యక్రియల్లో భార్య చేసిన పనికి అంతా కన్నీటిపర్యంతం!
X

దిశ, తెలంగాణ క్రైం బ్యూరో: మావోయిస్టుల మందుపాతర ఘటనలో చనిపోయిన కానిస్టేబుల్ భార్య సతీ సహగమన ప్రయత్నం చేసింది. ఈ సంఘటన ఛత్తీస్ గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లా నెర్రం గ్రామంలో జరిగింది. ఇటీవల మావోయిస్టులు దంతేవాడ జిల్లా అరన్పూర్ రోడ్డులో పోలీసులు వెళుతున్న వాహనాన్ని టార్గెట్ చేసి భారీ మందుపాతరను పేల్చిన విషయం తెలిసిందే. ఈ సంఘటనలో పదకొండు మంది చనిపోగా మృతుల్లో కానిస్టేబుల్ లక్ష్మా కూడా ఒకరు. కాగా, అతని స్వగ్రామమైన నెర్రంలో అంత్యక్రియలు జరుపుతుండగా తాను కూడా చనిపోతా అంటూ లక్ష్మా భార్య చితిపై పడుకుంది. అయితే, బంధువులు, గ్రామస్తులు నచ్చచెప్పి ఆమెను కిందకి దించి అంత్యక్రియలు పూర్తి చేసినట్టు సమాచారం. ఈ ఘటనను చూసి జవాన్ లక్ష్మా అంత్యక్రియలకు వచ్చినవారంతా కన్నీటి పర్యంతమయ్యారు.

Advertisement

Next Story