ఇదేం నీచ బుద్ధి.. విదేశీ మహిళా టూరిస్టులకు రేటు కడుతూ జైపూర్ యువకుడు వీడియో.. భాష తెలియక కేరింతలు

by Prasad Jukanti |
ఇదేం నీచ బుద్ధి.. విదేశీ మహిళా టూరిస్టులకు రేటు కడుతూ జైపూర్ యువకుడు వీడియో.. భాష తెలియక కేరింతలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: అమెరికాకు చెందిన మహిళా టూరిస్టుకు జైపూర్ కు చెందిన ఓ నగల వ్యాపారి రూ.300 విలువ చేసే ఓ ఆభరణాన్ని రూ.6 కోట్లకు అంటగట్టి మోసగించిన ఘటన మరువక ముందే అదే జైపూర్ లో మరో దారుణం వెలుగు చూసింది. సిగ్గుతో తలదించుకునేలా విదేశీ మహిళా టూరిస్టుల పట్ల జైపూర్ కు చెందిన ఓ యువకుడి నీచ ప్రవర్తన నెటిజన్లు ఆగ్రహానికి గురి చేసింది. అతడి వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో సదరు వ్యక్తిని జైపూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇంతకీ ఏం జరిగిందంటే.. జైపూర్ లోని అమెర్ పోర్ట్ సమీపంలో ఓ యువకుడు తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో విదేశీ టూరిస్టులకు సంబంధించిన వీడియోలను పోస్ట్ చేశాడు. ఒక వీడియోలో అమెర్ పోర్ట్ వద్దకు వచ్చిన మహిళా టూరిస్టులను వీడియో తీస్తూ వారికి 'రేట్ ట్యాగ్' లు ఫిక్స్ చేయడం కనిపిస్తుంది. ఓ మహిళను చూపిస్తూ ఈమె రూ.150 కి అందుబాటులో ఉందని మరొక మహిళను చూపిస్తూ ఈవిడ రూ.200 అందుబాటులో ఉంది, మరొకరు రూ.500, మరొకరిని రూ. 300 కే పొందవచ్చు అంటూ అసభ్యకర రీతిలో వ్యాఖ్యలు చేశారు. అయితే అతడి స్థానిక భాష తెలియని సదరు పర్యాటకులు తమతో సరదాగా వీడియో తీసుకుంటున్నారని భావించి ఆ వీడియోలో కేరింతలు కొడుతున్నారు.

మరో వీడియోలో విదేశీ మహిళా టూరిస్ట్ వద్దకు సమీపంగా వెళ్లడం, మరో మెయిల్ టూరిస్ట్ వద్దకు వెళ్లి ఇతను 'హే మేరా సాలా' అంటూ అసభ్యకరమైన ప్రకటనలు చేస్తూ వీడియాలు తీశాడు. వీటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం కావడంతో అతడిని జైపూర్ పోలీసులు అరెస్ట్ చేసి సెక్షన్ 354, 505(2) ఐపీసీ, 66డీ ఐటీ చట్టం, 13(1), 13(2) రాజస్థాన్ టూరిజం బిజినెస్ యాక్ట్ కింద కేసులు పెట్టారు.కాగా అతడు విదేశీ టూరిస్టులతో అసభ్యంగా ప్రవర్తించడమే కాకుండా అమెర్ మార్కెట్‌లోని తన దుకాణం నుండి పర్యాటకులు బలవంతంగా వస్తువులు కొనుగోలు చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది.

Advertisement

Next Story

Most Viewed