Inder Singh Parmar: అమెరికాను కనిపెట్టింది మనవాళ్లే.. మధ్యప్రదేశ్ విద్యాశాఖ మంత్రి సంచలన వ్యాఖ్యలు

by Prasad Jukanti |
Inder Singh Parmar: అమెరికాను కనిపెట్టింది మనవాళ్లే.. మధ్యప్రదేశ్ విద్యాశాఖ మంత్రి సంచలన వ్యాఖ్యలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: అమెరికాను ఇటలీ నావికుడైన క్రిస్టఫర్ కొలంబర్ 1492లో కనుగొన్నట్లు ఇన్నాళ్లు మనం చదువుతున్నాం. అయితే ఇదంతా తప్పు అని మధ్యప్రదేశ్ విద్యాశాఖ మంత్రి ఇందర్ సింగ్ పర్మార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అమెరికాను డిస్కవరీ చేసింది కోలంబస్ కాదని మన దేశ పూర్వికులేననని సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. అలాగే పోర్చుగీస్ అన్వేషకుడు వాస్కోడిగామ భారదేశాన్ని కనుగొన్నట్లు మన విద్యార్థులకు తప్పుడు చరిత్ర బోధిస్తున్నారని ఆరోపించారు. ఇటీవల ఆయన భోపాల్ లోని బర్కతుల్లా విశ్వవిద్యాలయంలో జరిగిన స్నాతకోత్సవ కార్యక్రమంలో పాల్గొని ప్రసంగిస్తూ కోలంబస్ అమెరికాను కనుగొన్నాడనే విషయంలో భారతీయ విద్యార్థులకు సంబంధం లేదు. వారికి నేర్పించవలిసింది అక్కడి స్థానిక గిరిజన ప్రజలను కోలంబస్ ఎలా హింసించాడు ఎలా నాశనం చేశాడో నేర్పించాలన్నాడు. వారు ఎలా చంపబడ్డారు, ఎలా కన్వర్ట్ చేయబడ్డారో బోధించాలన్నారు. ఆఫ్రికాలోని జాంజిబార్ ఓడరేవులో గుజరాతీ వ్యాపారి చందన్ తో తాను భారత్ ను చూడాలనే కోరికను వస్కోడిగామా వ్యక్తం చేయడంతో చందన్ తన ఓడను అనుసరించాలని వాస్కోడిగామాకు చెప్పాడని అంతే తప్ప ఆయన ఇండియాను కనుగొనలేదన్నారు. భారతీయ వ్యాపారి చందన్ ఓడ తన కంటే చాలా పెద్దదని వాస్కోడగామా స్వయంగా రాశాడని, అయితే పోర్చుగీస్ అన్వేషకుడు భారతదేశాన్ని కనుగొన్నాడని విద్యార్థులకు తప్పుడు చరిత్ర బోధించారని పర్మార్ చెప్పారు. పర్మార్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Advertisement

Next Story

Most Viewed