రికార్డు స్థాయిలో వీసాలు జారీ చేసిన US!

by Hajipasha |   ( Updated:2023-01-05 06:04:36.0  )
రికార్డు స్థాయిలో వీసాలు జారీ చేసిన US!
X

దిశ, వెబ్‌డెస్క్: అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి నెడ్ ప్రైస్ కీలక విషయాలు వెల్లడించారు. ప్రతి సంవత్సరం పెద్ద సంఖ్యలో భారతీయ విద్యార్థులు ఉన్నత విద్య కోసం అమెరికా వెళుతున్నారు. అయితే గతేడాది రికార్డు స్థాయిలో స్టూడెంట్ వీసాలు పంపినట్లు తెలిపారు. భారతదేశంలోని యూఎస్‌ ఎంబసీ, కాన్సులేట్‌లు 1,25,000 స్టూడెంట్ వీసాలను జారీ చేశాయని విదేశాంగ శాఖ ప్రతినిధి బుధవారం తెలిపారు. ఈ వీసాలో కొన్ని కారణాల వల్ల ఆలస్యం జరిగినప్పటికీ.. 2016 నుండి 2022 వరకు ఎన్నడూ లేని విధంగా అమెరికా ఎక్కువ విద్యార్థి వీసాలను జారీ చేసిందని వెల్లడించారు. ఇక ఒకే ఆర్థిక సంవత్సరంలో జారీ చేయబడిన వీసాలు వారి ఆల్ టైమ్ రికార్డును బద్దలు కొట్టాయని, దాదాపు 1,25,000 విద్యార్థి వీసాలు జారీ చేశామని అన్నారు. వీసా ప్రాసెసింగ్ అంచనా వేసిన దానికంటే రాబోయే సంవత్సరంలో యుఎస్ ప్రభుత్వం ప్రీ-పాండమిక్ ప్రాసెసింగ్ స్థాయిలకు చేరుకుంటుందని పేర్కొన్నారు. అంతేకాక భారతదేశంలో వీసా ఇంటర్వ్యూ అపాయింట్‌మెంట్‌ల కోసం వేచి ఉండే సమయాన్ని తగ్గించడానికి యుఎస్ ప్రభుత్వం ప్రతి ప్రయత్నం చేస్తోందని ప్రైస్ తెలిపారు.

ఇంకా చదవండి : 18,000 మంది ఉద్యోగులను తొలగించనున్న Amazon ..

Advertisement

Next Story

Most Viewed