- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఇస్రో ప్రయోగం.. మరికొద్దిసేపట్లో నింగిలోకి 36 ఉపగ్రహాలు
దిశ, వెబ్ డెస్క్: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ మరికొద్దిసేపట్లోనే జీఎస్ఎల్వీ మార్క్3-M3 రాకెట్ ను ప్రయోగించనుంది. దీంతో ఒకేసారి 36 ఉపగ్రహాలను కక్ష్యలోకి పంపనుంది. ఆదివారం ఉదయం 9 గంటలకు శ్రీహరి కోట నుంచి ప్రయోగాన్ని నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించి కౌంట్‌డౌన్‌ను శనివారం ఉదయం 8.30 గంటలకు ప్రారంభమైంది. ఇస్రో కమర్షియల్ బాట పట్టిన తరువాత అంతర్జాతీయ స్థాయిలో వివిధ దేశాలు, కార్పొరేట్ కంపెనీలకు చెందిన ఉపగ్రహాలను అంతరిక్షంలోకి విజయవంతంగా ప్రయోగిస్తోంది.
ఈ నేపథ్యంలోనే ఒకేసారి 36 ఉపగ్రహాలను అంతరిక్షంలోకి ప్రయోగించడానికి ఏర్పాట్లను పూర్తి చేసింది. ఆ ఉపగ్రహాలు వన్ వెబ్ ఇంటర్నెట్ సంస్థకు చెందిన ఉపగ్రహాలు. బ్రాడ్ బ్యాండ్ సేవలను మరింత ప్రజలకు చేరువ చేసేందుకు జెన్- 1 కాన్స్టెలేషన్ నెట్ వర్క్ శాటిలైట్లను ప్రయోగించేందుక ఇస్రో సహకారాన్ని తీసుకుంటోంది. వన్ వెబ్ ఇంటర్నెట్ అనేది బ్రిటన్ కు చెందిన నెట్ వర్క్ యాక్సెస్ అసోసియేట్స్ లిమిటెడ్ గ్రూప్ లో అదొకటి. మొత్తంగా 72 శాటిలైట్లను లో-ఎర్త్ ఆర్బిట్ లో ప్రవేశపెట్టేందుకు ఇస్రోతో ఆ సంస్థ ఒప్పందాన్ని కుదుర్చుకుంది.