INS Bramhaputhra: ఐఎన్ఎస్ బ్రహ్మపుత్ర ప్రమాదం.. అదృశ్యమైన నావికుడి మృతదేహం లభ్యం

by vinod kumar |
INS Bramhaputhra: ఐఎన్ఎస్ బ్రహ్మపుత్ర ప్రమాదం.. అదృశ్యమైన నావికుడి మృతదేహం లభ్యం
X

దిశ, నేషనల్ బ్యూరో: ముంబై నౌకాదళ డాక్‌యార్డ్‌లో భారత యుద్ధనౌక ఐఎన్‌ఎస్ బ్రహ్మపుత్రలో అగ్ని ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. అయితే ఈ ఘటనలో అదృశ్యమైన నావికుడు సీమన్ సితేంద్ర సింగ్ మృతదేహం లభ్యమైనట్టు అధికారులు తెలిపారు. ఇంటెన్సివ్ డైవింగ్ ఆపరేషన్ల తర్వాత బుధవారం మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నట్టు నేవీ అధికార ప్రతినిధి కమాండర్ వివేక్ మధ్వల్ తెలిపారు. నేవీ చీఫ్ అడ్మిరల్ దినేష్ కే త్రిపాఠి, భారత నావికాదళ సిబ్బంది సితేంద్ర కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. వారి ఫ్యామిలీకి అండగా ఉంటామని చెప్పారు. మరోవైపు అగ్ని ప్రమాదానికి దారితీసిన పరిస్థితులను సమీక్షించడానికి త్రిపాఠి మంగళవారం ముంబైకి వచ్చారు. నౌక నష్టాన్ని తగ్గించేందుకు తీసుకున్న చర్యలు, దాని పనితీరును పునరుద్ధరించేందుకు జరుగుతున్న ప్రయత్నాలను ఆయనకు అధికారులు వివరించారు. ఐఎన్‌ఎస్ బ్రహ్మపుత్రను వీలైనంత త్వరగా యుద్ధానికి సిద్ధంగా ఉండేలా చేయడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని త్రిపాఠి ఆదేశించారు.

Advertisement

Next Story