Atomic Bomb Test : భారత్ అణుబాంబు క్షిపణి టెస్ట్ సక్సెస్

by M.Rajitha |   ( Updated:2024-11-29 15:33:25.0  )
Atomic Bomb Test : భారత్ అణుబాంబు క్షిపణి టెస్ట్ సక్సెస్
X

దిశ, వెబ్ డెస్క్ : భారత నౌకాదళం(Indian Navy) అణ్వాయుధ(Nuclear Weapon) సామర్థ్యం గల 'K-4 బాలిస్టిక్ క్షిపణి'(K-4 Ballistic Missile')ని విజయవంతంగా పరీక్షించింది. ఈ మిస్సైల్​ను కొత్తగా ఇండియన్ నేవీలో చేరిన న్యూక్లియర్ సబ్​మరైన్ ఐఎన్ఎస్ అరిఘాట్ నుంచి గురువారం ప్రయోగించారు. ఈ క్షిపణి 3,500 కిలోమీటర్ల రేంజ్​ను ఈజీగా టార్గెట్ చేసిందని అధికారులు వెల్లడించారు. ఈ క్షిపణి టెస్టింగ్​కు ముందు నీటి అడుగున ప్లాట్‌ఫారమ్‌ల నుంచి కూడా క్షిపణి ప్రయోగ ట్రయల్స్‌ను డీఆర్డీవో (DRDO) నిర్వహించిందని ఆర్మీ వర్గాలు తెలిపాయి. ఒక దేశంపై సెకండ్ అటాక్ చేయగల సామర్థ్యం దీనికి ఉంది. అంటే శత్రు దేశాలు మనపై అటాక్ చేసిన సందర్భాల్లో మనం భూమిపై తిరిగి అటాక్ చేసేందుకు పరిస్థితి సహకరించకపోతే, సబ్​మెరైన్ నీటి అడుగు నుంచి దీని సహాయంతో ప్రతిదాడి చేయొచ్చు.

భారత్ నో ఫస్ట్-యూజ్ న్యూక్లియర్ పాలసీకి కట్టుబడి ఉంది. ఈ నేపథ్యంలోనే భారత్ రక్షణ వ్యవస్థను మరింత పటిష్టం చేసే దిశగా అడుగులు వేస్తోంది. దీనిలో భాగంగా ఇండియన్ నావీ మిస్సైల్ సిస్టమ్​ను మరింత బలపరిచేందుకు K4 బాలిస్టిక్ క్షిపణి వంటి ప్రయోగాలు చేపడుతోంది. K-4 SLBM ఒక ఇంటర్మీడియట్-రేంజ్ సబ్‌మెరైన్-లాంచ్ అణు బాలిస్టిక్ క్షిపణి. ఇది నేవీకి చెందిన అరిహంత్ క్లాస్ సబ్​మెరైన్‌లలో ఇన్​స్టాల్​అయి ఉంటుంది. గతంలో భారత నౌకాదళం K-15ను ఉపయోగించింది. దీనికంటే ప్రస్తుత K-4 చాలా మెరుగైన, మరింత ఖచ్చితమైన, విన్యాసాలు చేయగల క్షిపణి. ఈ టూ-స్టేజ్ మిస్సైల్ సాలిడ్ రాకెట్ మోటార్​ ద్వారా రన్​ అవుతుంది. దీనిలోని ప్రొపెల్లెంట్ కూడా కూడా సాలిడ్​గా ఉంటుంది. దీని ఆపరేషనల్ రేంజ్ 4,000 కిలోమీటర్లు.

Advertisement

Next Story