- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Ranveer Allahbadia: యూట్యూబర్ రణ్ వీర్ చుట్టూ బిగుకుంటున్న ఉచ్చు

దిశ, నేషనల్ బ్యూరో: తల్లిదండ్రుల గురించి, శృంగారం పైన ప్రశ్నించి వివాదాల్లో చిక్కుకున్న ప్రముఖ యూట్యూబర్ రణ్ వీర్ అల్హాబాదియా చుట్టూ ఉచ్చు బిగుసుకుంటోంది. రణ్‌వీర్ అల్హబాదియా (Ranveer Allahbadia)పై ముంబై పోలీసులు కేసు నమోదు చేశారు. భారతీయ కుటుంబ వ్యవస్థను కించపరిచేలా, మనోభావాలు దెబ్బతినేలా కామెంట్స్ చేశాడని ఫిర్యాదు రావడంతో కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. యూట్యూబర్ అపూర్వ ముఖిజా, కమెడియన్ సమయ్ రైనా తోపాటు మరికొందరి పేర్లను ఎఫ్‌ఐఆర్‌లో చేర్చారు. సోషల్ మీడియాను ప్రభావితం చేసేవారు భారతీయ కుటుంబ వ్యవస్థను కించపరిచేలా, మతపరమైన భావాలను దెబ్బతీస్తున్నారని, దురుద్దేశంతోనే అలాంటి కామెంట్లు చేశారనే ఆరోపణలపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. అంతేకాకుండా, మరో యూట్యూబర్ అపూర్వ ముఖిజా అలియాస్ ది రెబెల్ కిడ్ పైన కేసు నమోదయ్యింది. అపూర్వ అరుణాచల్ ప్రదేశ్‌లోని ఆహారపు అలవాట్ల గురించి మాట్లాడారు. "నేను ఎప్పుడూ రుచి చూడకపోయినా అరుణాచల్ ప్రదేశ్ ప్రజలు కుక్క మాంసం తింటారు. నా స్నేహితులు దానిని తింటారు కాబట్టి నాకు తెలుసు. వారు కొన్నిసార్లు తమ పెంపుడు జంతువులను కూడా తింటారు" అని ఆమె కామెంట్స చేసినట్ల ఫిర్యుదలో పేర్కొన్నారు. ఆమె వ్యాఖ్యల వల్ల ఈశాన్య రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కలుగుతుందని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇక, ప్రొడక్షన్ విభాగానికి చెందిన సమయ్ రైనా ఆ వీడియోను సోషల్ మీడియాలో పంచుకున్నారన్నారు. సామాజిక అశాంతిని సృష్టించేలా వారి షో ఉందంటూ విమర్శించారు. దీనిపై సైబర్ విభాగం కేసు నమోదు చేసింది.
కేసు నమోదు
అసోం పోలీసులు కూడా ఈ విషయంలో కేసు నమోదు చేశారు. దర్యాప్తులో భాగంగా అసోం నుంచి ఒక బృందం ముంబైకి వచ్చింది. అపూర్వ ముఖిజా సోమవారం తన న్యాయవాదితో కలిసి ఖార్ పోలీస్ స్టేషన్ కు వెళ్లి.. తన వాంగ్మాలాన్ని నమోదు చేశారు. ఇకపోతే అల్హాబాదియా వ్యాఖ్యలపై జాతీయ మహిళా కమిషన్ ఆందోళన వ్యక్తం చేసింది. ఫిబ్రవరి 17న విచారణకు హాజరుకావాలని అల్హాబాదియా సహా ఆ షోతో సంబంధం ఉన్న 30 మందికి నోటీసులు పంపింది. మహారాష్ట్ర సైబర్ సెల్ కూడా ఐటీ చట్టం కింద కేసు నమోదు చేసింది. షోతో సంబంధం ఉన్న 30 మందికి సమన్లు పంపింది. అంతేకాకుండా ఈ విషయం పార్లమెంటుకు చేరుకుంది. శివసేన ఎంపీ నరేష్ మష్కే అభ్యంతరకరమైన వ్యాఖ్యలను ఫ్లాగ్ చేసి ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లపై సెన్సార్‌షిప్ చేయాలని డిమాండ్ చేశారు. శివసేన (యూబీటీ) ఎంపీ ప్రియాంక చతుర్వేది ఈ విషయాన్ని హౌస్ ప్యానెల్‌లో లేవనెత్తుతానని చెప్పారు. కాగా.. ఇండియా గాట్ లాటెంట్ షోలో అల్హాబాదియా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆ షోకు సమయ్ హోస్ట్ కాగా.. గెస్ట్ జడ్జీలుగా రణ్ వీర్, అపూర్వ, జస్ప్రీత్ సింగ్, ఆశిశ్ చాంచ్లానీ పాల్గొన్నారు.