'ఇండియా అన్‌స్టాపబుల్'.. వందే భారత్ ఎక్స్‌ప్రెస్ వేగంతో దూసుకెళ్తోంది : ప్రధాని మోడీ

by Vinod kumar |   ( Updated:2023-05-25 14:49:07.0  )
ఇండియా అన్‌స్టాపబుల్.. వందే భారత్ ఎక్స్‌ప్రెస్ వేగంతో దూసుకెళ్తోంది : ప్రధాని మోడీ
X

న్యూఢిల్లీ: యావత్ ప్రపంచం నేడు భారత్ వైపు ఎంతో ఆశతో చూస్తోందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంలో, పేదరికంతో పోరాడటంలో, కోవిడ్-19ను సమర్థవంతంగా ఎదుర్కోవడంలో మన దేశం అద్భుతమైన పురోగతిని సాధించిందని ఆయన చెప్పారు. భారత్‌కు రావాలని.. భారతదేశ సారాన్ని అర్థం చేసుకోవాలని ప్రపంచ నలుమూలల నుంచి ప్రజలు కోరుకుంటున్నట్టు మోడీ వెల్లడించారు. ఇటువంటి పరిస్థితుల్లో ఉత్తరాఖండ్ వంటి రాష్ట్రాలకు అద్భుతమైన అవకాశాలు ఉన్నాయన్నారు.

డెహ్రాడూన్ నుంచి ఢిల్లీ వరకు వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలును ఆయన వీడియో కాన్షరెన్స్ ద్వారా జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇక భారత్‌ను ఎవ్వరూ నిలువరించలేరని.. వందే భారత్ రైలు అంత వేగంగా ముందుకు దూసుకెళుతోందని చెప్పారు. ‘భారదేశాన్ని చూడటానికి, భారతదేశ సారాన్ని అర్థం చేసుకోవడానికి ప్రపంచ ప్రజలు ఆశతో చూస్తున్నారు.

ఇటువంటి పరిస్థితుల్లో ఉత్తరాఖండ్ వంటి రాష్ట్రాలకు అద్భుతమైన అవకాశాలున్నాయి. ఆ అవకాశాలను పూర్తిగా సద్వినియోగం చేసుకునేందుకు వందే భారత్ రైలు సహాయం చేయబోతోంది’ అని మోడీ అన్నారు. ఇండియన్ రైల్వేస్ రూపు రేఖలను ప్రభుత్వం మార్చేసిందని.. హై స్పీడ్ రైళ్ల కల సాకారం అయిందని చెప్పారు. రాబోయే రోజుల్లో దేవభూమి యావత్ ప్రపంచ అధ్యాత్మిక చైతన్యానికి కేంద్రంగా మారనుందని ప్రధాని అన్నారు. ‘రాబోయే రోజుల్లో యావత్ ప్రపంచ అధ్యాత్మిక చైతన్యానికి దేవభూమి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అవుతుంది. భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా ఉత్తరాఖండ్‌ను తీర్చిదిద్దాలి’ అని మోడీ చెప్పారు.

Advertisement

Next Story

Most Viewed