వారసత్వ పట్టాలపై అభివృద్ధి మార్గంలో భారత్ : మోదీ

by samatah |
వారసత్వ పట్టాలపై అభివృద్ధి మార్గంలో భారత్ : మోదీ
X

న్యూఢిల్లీ: భారతదేశం వారసత్వమనే పట్టాలపై అభివృద్ధి మార్గంలో దూసుకుపోతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. అపారమైన ఆత్మగౌరవంతో తన వారసత్వంపై గర్వాన్ని వ్యక్తం చేస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. ఆధునికతకు నాంది పలుకుతూనే తన సంప్రదాయాలను బలోపేతం చేసుకుంటామని చెప్పారు. ఆదివారం ఆర్యసమాజ్ వ్యవస్థాపకుడు దయానంద్ సరస్వతీ 200వ జయంతి వేడుకల ప్రారంభ కార్యక్రమంలో మాట్లాడారు. దేశ విధానాలు, ప్రయత్నాలకు ఎలాంటి వివక్ష లేదని తెలిపారు. పేదలకు, వెనుకబడిన వారికి, అణగారిన వర్గాలకు ప్రాధాన్యతనిస్తూ సేవ చేయడమే లక్ష్యమని అన్నారు.

పర్యావరణ రంగంలో ప్రపంచానికి భారత్ దారి చూపిస్తుందని ప్రధాని చెప్పారు. ఈ ఏడాది జీ20కి అధ్యక్షత వహిస్తుండడం దేశానికి గర్వకారణమని చెప్పారు. దేశం వారసత్వమైన పట్టాలపై అభివృద్ధి మార్గంలో నడుస్తుందని తెలిపారు. మహర్షి దయానంద్ సరస్వతి చూపిన మార్గం కోట్లాది మందిలో ఆశలను నింపుతుందని అన్నారు. ఈ వేడుకలు చారిత్రాత్మకమని, భవిష్యతు మానవత్వానికి స్ఫూర్తిగా ఉంటాయని పిలుపునిచ్చారు. దయానంద్ భారత మహిళ సాధికారతకు గొంతుకగా నిలిచి, సామాజిక వివక్ష, అంటరానితనంపై పోరాటం చేశారని గుర్తు చేశారు. సియాచిన్‌లో మోహరింపులు, రాఫెల్ యుద్ధ విమానాలను ఎగురవేయడం వరకు నేడు దేశంలోని కూతుళ్లు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారని మోడీ అన్నారు. 1824లో జన్మించిన సరస్వతీ సామాజిక అసమానతకు వ్యతిరేకంగా పనిచేశారు. విద్య, ఇతర సంస్కరణల్లో సామాజక అవగహాన కల్పన కల్పించేందుకు కృషి చేశారు.


Advertisement

Next Story

Most Viewed