- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
యుద్ధానికి దూరంగా ఉండాలని భారతీయులకు విదేశాంగ శాఖ సూచన
దిశ, నేషనల్ బ్యూరో: రష్యా సైన్యంలో సహాయక సిబ్బందిగా పనిచేస్తున్న భారతీయులను విడుదల చేయడానికి మాస్కోతో సంప్రదింపులు జరుపుతున్నామని, ఉక్రెయిన్‌లోని ఘర్షణ ప్రాంతం నుంచి దూరంగా ఉండాలని భారతీయులను కోరుతున్నట్టు భారత విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైశ్వాల్ అన్నారు. కొంతమంది భారతీయులు రష్యా సైన్యానికి సహాయక సిబ్బందిగా పనిచేస్తున్నారని, అందుకోసం కాంట్రాక్టులపై సంతకాలు చేసినట్టు సమాచారం అందింది. ఈ వార్తలపై స్పందించిన ఆయన, దీని గురించి రష్యన్ అధికారులతో ఎప్పటికప్పుడు మాట్లాడి వారిని విడుదల చేసేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. 'భారతీయులందరూ తగిన జాగ్రత్తలు పాటించాలని, ఈ రష్యా-ఉక్రెయిన్ యుద్ధం నుంచి దూరంగా ఉండాలని మేము కోరుతున్నామ'ని ఆయన పేర్కొన్నారు. ఈ వారం ప్రారంభంలో కొందరు భారతీయులు ముఖ్యంగా తెలంగాణతో పాటు కర్ణాటక, గుజరాత్, యూపీ, కశ్మీర్‌కు చెందిన యువకులు రష్యాలో ఉద్యోగాలు ఇప్పిస్తామన్న ఏజెంట్ల మాటలను నమ్మి వెళ్లారని ఏఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ అన్నారు. దీని గురించి విదేశాంగ శాఖ మంత్రి జై శంకర్‌తో పాటు రష్యాలోని భారత రాయబారికి లేఖలు రాసినట్టు వెల్లడించారు.