- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
India bloc: కేజ్రీవాల్ ఆరోగ్యం క్షీణించడంపై ఇండియా కూటమి ర్యాలీ
దిశ, నేషనల్ బ్యూరో: జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆరోగ్యం క్షీణించడంపై ఇండియా కూటమి ఆందోళన వ్యక్తం చేసింది. దీనికి సంబంధించి మంగళవారం ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఇండియా కూటమి ర్యాలీలో ప్రధాన భాగస్వామ్య పక్షాలైన కాంగ్రెస్, సమాజ్ వాదీ పార్టీ, తృణమూల్ కాంగ్రెస్, సీపీఐ, జార్ఖండ్ ముక్తి మోర్చా, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ, శివసేన(యూ), ఎన్సీపీ-ఎస్పీ, ఇంకా ఇతర ప్రతిపక్ష పార్టీలు పాల్గొంటున్నాయి. ఈ విషయాన్ని ఆప్ రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్ సోమవారం ప్రకటించారు. జైల్లో ఉన్న కేజ్రీవాల్‌ను హత్య చేసేందుకు బీజేపీ కుట్ర పన్నుతోందని, జూన్ 3 నుంచి జూలై 7 మధ్య కేజ్రీవాల్ షుగర్ లెవల్స్ 34 సార్లు పడిపోయినట్టు మెడికల్ రిపోర్టులు చెబుతున్నాయని ఆమ్ ఆద్మీ పార్టీ ఆరోపణలు చేస్తోంది. జంతర్ మంతర్ వద్ద జరిగే ర్యాలీకి హాజరయ్యే నేతల పేర్లను మంగళవారం వెల్లడిస్తానని సింగ్ పేర్కొన్నారు.