తమిళనాడులో 38 స్థానాల్లో ఇండియా కూటమి ముందంజ

by Harish |
తమిళనాడులో 38 స్థానాల్లో ఇండియా కూటమి ముందంజ
X

దిశ, నేషనల్ బ్యూరో: తమిళనాడులో మొత్తం 39 పార్లమెంటరీ స్థానాల్లో డీఎంకే ఆధ్వర్యంలోని ఇండియా కూటమి అభ్యర్థులు 38 స్థానాల్లో ముందంజలో ఉన్నారు. అధికార ద్రవిడ మున్నేట్ర కజగం (DMK) భారీ ఆధిక్యంలో కొనసాగుతుంది. ప్రస్తుతం అది 21 స్థానాల్లో ముందంజలో ఉంది. అలాగే, కాంగ్రెస్ 9 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. రాష్ట్రంలో విపక్షాలైన అన్నాడీఎంకే, బీజేపీ, స్టాలిన్ నేతృత్వంలోని కూటమి మధ్య ప్రధాన పోటీ ఉండగా, ఇండియా కూటమి పోటీ చేసిన అన్ని స్థానాల్లో కూడా విజయం వైపు దూసుకుపోతుంది. కోయంబత్తూరు డీఎంకే అభ్యర్థి గణపతి రాజ్‌కుమార్ 1,58,051 ఓట్లతో ఆధిక్యంలో ఉండగా, బీజేపీ అభ్యర్థి అన్నామలై వెనుకంజలో ఉన్నారు. తూత్తుకుడి డీఎంకే అభ్యర్థి కనిమొళి 3,67,481 ఓట్లతో ముందంజలో ఉండగా, ఏఐఏడీఎంకే అభ్యర్థి శివసామి వెనుకంజలో ఉన్నారు. చెన్నై సెంట్రల్ డీఎంకే అభ్యర్థి దయానిధి మారన్ 1,77,300 ఓట్లతో ముందంజలో ఉండగా, బీజేపీ అభ్యర్థి వినోజ్ వెనుకంజలో ఉన్నారు. నీలగిరి డీఎంకే అభ్యర్థి ఎ రాజా 3,51,335 ఓట్లతో ముందంజలో ఉండగా, బీజేపీకి చెందిన మురుగన్ ఎల్ వెనుకంజలో ఉన్నారు.

Advertisement

Next Story