హర్యానాలో మారిన సమీకరణలు.. 50 దాటిన బీజేపీ బలం

by Mahesh |   ( Updated:2024-10-09 12:07:01.0  )
హర్యానాలో మారిన సమీకరణలు.. 50 దాటిన బీజేపీ బలం
X

దిశ, వెబ్ డెస్క్: పార్లమెంట్ ఎన్నికల తర్వాత జరిగిన హర్యానా అసెంబ్లీ ఎన్నికలపై దేశవ్యాప్తంగా చర్చ జరిగింది. ఆ రాష్ట్రంలో వరుసగా రెండు సార్లు విజయం సాధించిన బీజేపీపై వ్యతిరేకత ఉందని, రైతుల ఉద్యమం, రెజ్లర్ల నిరసన ఆ పార్టీకి వ్యతిరేకంగా మారుతాయని, బీజేపీకి ఈ ఎన్నికల్లో ఓటమి తప్పదని ఎగ్జిట్ ఫోల్స్ అంచనా వేశారు. కానీ ఎన్నికల ఫలితాలు మాత్రం అందుకు భిన్నంగా వచ్చాయి. దీంతో సర్వే సంస్థలతో పాటు కాంగ్రెస్ పార్టీ ఆశ్చర్యానికి గురైన విషయం తెలిసిందే. కాగా ఈ ఎన్నికల్లో హర్యానా ప్రజలు రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా.. బీజేపీకి మూడో సారి పట్టం కట్టడమే కాకుండా.. 2019 ఎన్నికల్లో ఇచ్చిన సీట్ల కంటే మరో ఎనిమిది స్థానాలు అధికంగా ఇచ్చారు.

ఇదిలా ఉంటే ఎన్నికల ఫలితాల అనంతరం హర్యానా రాజకీయ సమీకరణలు అమాంతం మారిపోయాయి. ఇండిపెండెంట్ అభ్యర్థులుగా గెలిచిన ఇద్దరు ఎమ్మెల్యేలు ఈ రోజు బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా వారికి బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జ్ ధర్మేంద్ర ప్రధాన్ పార్టీ కండువా కప్పి ఆహ్వానం పలికారు. దీంతో హర్యానాలో బీజేపీ బలం 50 కి చేరుకుంది. మరోపక్క హిసార్ అసెంబ్లీ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా గెలిచిన, సావిత్రి జిందాల్ బీజేపీకి మద్దతు ప్రకటించారు. హిస్సార్ అభివృద్ధి కోసం నేను బీజేపీ ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాలని నిర్ణయించుకున్నాను" అని ఆమె చెప్పుకొచ్చింది.

Advertisement

Next Story

Most Viewed