- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Jharkhand: జార్ఖండ్ సీం సోరెన్ పీఏ నివాసంలో ఐటీ సోదాలు
దిశ, నేషనల్ బ్యూరో: అసెంబ్లీ ఎన్నికల వేళ జార్ఖండ్‌లో (Jharkhand) రాజకీయాలు హీట్ ఎక్కాయి. జార్ఖండ్ ముఖ్యమంత్రి, జేఎంఎం నేత హేమంత్ సోరెన్ (CM Hemant Soren) వ్యక్తిగత సలహాదారు సునీల్ శ్రీవాత్సవ (Sunil Srivastava)ని ఆదాయ పన్ను శాఖ (IT Raids) టార్గెట్ చేసింది. రాంచీ అశోక్ నగర్‌లోని ఆయన ఇంటిపై ఐటీ అధికారులు దాడులు చేపట్టారు. రాంచీ, జంషెడ్‌పూర్‌లో దాదాపు తొమ్మిది చోట్ల ఏకకాలంలో ఐటీ సోదాలు నిర్వహిస్తున్నారు. సునీల్ శ్రీవాత్సవ కొన్ని అక్రమాలకు పాల్పడినట్లు ఐటీ అధికారులకు సమాచారం అందింది. అయితే, ఎంత మొత్తం పన్ను ఎగవేశారన్నది తెలియరాలేదు. ఈ కారణంగానే ఐటీ అధికారులు దాడులు చేపట్టినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.
సీబీఐ దాడులు
మరోవైపు, అక్రమ మైనింగ్ కేసులో హేమంత్ సోరెన్ సన్నిహితుడు పంకజ్ మిశ్రా, అతని సహచరుల రహస్య స్థావరాలపై కూడా సీబీఐ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో రూ.50 లక్షల నగదు, కిలో బంగారం, వెండి, 61 కాట్రిడ్జ్‌లను సీబీఐ స్వాధీనం చేసుకుంది. అంతేకాకుండా, ల్యాండ్ స్కాం కేసులో ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ పై ఆరోపణలు వచ్చాయి. భూ కుంభకోణం, మనీలాండరింగ్‌కు సంబంధించిన ఆరోపణలపై హేమంత్ సోరెన్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) జనవరిలో అరెస్టు చేసింది. జూన్ లో జార్ఖండ్ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఇకపోతే, 81 స్థానాలున్న జార్ఖండ్ అసెంబ్లీకి (Jharkhand Assembly Elections) రెండు విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి. తొలి విడతలో 43 స్థానాలకు నవంబర్ 13న ఎన్నికలు జరగనుండగా.. మిగిలిని 38 స్థానాలకు నవంబర్ 20న ఎన్నికలు ఉంటాయి. నవంబర్ 23న ఫలితాలు రానున్నాయి.