FASTag mandatory: ఫాస్టాగ్‌‌పై కీలక అప్‌డేట్.. ఏప్రిల్ 1 నుంచి అమలు

by D.Reddy |
FASTag mandatory: ఫాస్టాగ్‌‌పై కీలక అప్‌డేట్.. ఏప్రిల్ 1 నుంచి అమలు
X

దిశ, వెబ్ డెస్క్: ఫాస్టాగ్‌కు (FASTag) సంబంధించి మహారాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వం (Maharasta govt) కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ఆ రాష్ట్రంలో తిరిగే అన్ని వాహనాలకు ఫాస్టాగ్‌ను తప్పనిసరి చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈ నిబంధనలు ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి. ఏప్రిల్ 1 నుండి ఫాస్టాగ్ లేని వాహనదారులు జరిమానాగా రెట్టింపు టోల్ రుసుము చెల్లించాలి. గతంలో మహారాష్ట్రలో ఫాస్ట్ ట్యాగ్ తప్పనిసరి ఉండేది కాదు. దేశంలోని చాలా రాష్ట్రాల్లో ఫాస్టాగ్ తప్పనిసరి చేసినప్పటికీ కొన్ని రాష్ట్రాల్లో మినహాయింపులు ఉన్నాయి. ఆ రాష్ట్రాల్లో మహారాష్ట్ర కూడా ఒకటి. అయితే తాజా నిర్ణయంతో మహారాష్ట్రలో కూడా అన్ని వాహనాలపై ఫాస్టాగ్ తప్పనిసరి అయింది.

ఫాస్టాగ్ అనేది నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI), నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) నిర్వహించే స్టిక్కర్ ట్యాగ్. ఇది టోల్ ప్లాజాల వద్ద నగదు రహిత చెల్లింపు సౌలభ్యాన్ని అందించడంతో పాటు వాహనదారులకు ఇంధనం, సమయాన్ని ఆదా చేయడానికి సహాయపడుతుంది. ఫాస్టాగ్ రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ (RFID) టెక్నాలజీని ఉపయోగించి ట్యాగ్‌ను దూరం నుండి స్కాన్ చేయడం పూర్తి చేసి ప్రజల బ్యాంక్ ఖాతాలు లేదా డిజిటల్ వాలెట్ల నుండి రోడ్డు టోల్‌ను నేరుగా మినహాయించుకుంటుంది. ఫాస్టాగ్ వ్యవస్థలో ప్రస్తుతం భారతదేశంలోని 23 బ్యాంకులు భాగస్వామ్యులుగా ఉన్నాయి.

Next Story