- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నోట్లపై రవీంద్రనాథ్ ఠాగూర్, ఏపీజే అబ్దుల్ కలాం చిత్రాలు..!
దిశ, వెబ్ డెస్క్: జాతిపిత మహాత్మా గాంధీ 100వ జన్మదిన వేడుకలను పురస్కరించుకొని 1969లో భారతీయ కరెన్సీ నోట్లపై గాంధీ కనిపించారు. అయితే తొలిసారిగా మహాత్మా గాంధీతో పాటు ఇతర ప్రముఖుల వాటర్ మార్క్ నమూనాలను నోట్లపై ఉపయోగించాలని ఆర్‌బీఐ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకోసం ఒకటి, మూడు చిత్రాల ఎంపికపై తుది నిర్ణయం అత్యున్నత స్థాయిలో తీసుకోవడం జరుగుతుందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఆర్థిక మంత్రిత్వ శాఖ, RBI ఒక నివేదిక ప్రకారం.. కొత్త సిరీస్ బ్యాంక్ నోట్లపై రవీంద్రనాథ్ ఠాగూర్, APJ అబ్దుల్ కలాం వాటర్‌మార్క్ చిత్రాలను ఉపయోగించడాన్ని పరిశీలిస్తున్నాయి. అందుకు సంబంధించిన రెండు వేర్వేరు సెట్లను కేంద్రానికి పంపక ముందు ఐఐటి-ఢిల్లీ ఎమిరిటస్ ప్రొఫెసర్ దిలీప్ టి షాహానీకి పంపినట్లు సమాచారం. అనంతరం వాటిలో ఒకదాన్ని ఎంచుకొని కేంద్ర ప్రభుత్వ తుది పరిశీలనకు ఆయన పంపనున్నాడు.