ప్రతి సాధువులు, బాబాలకు ప్రభుత్వ భూమిలో మందిర నిర్మాణానికి అనుమతించలేం: కోర్టు

by Harish |
ప్రతి సాధువులు, బాబాలకు ప్రభుత్వ భూమిలో మందిర నిర్మాణానికి అనుమతించలేం: కోర్టు
X

దిశ, నేషనల్ బ్యూరో: ప్రతి సాధువులు, బాబాలు, గురువులకు ప్రభుత్వ భూమిలో మందిరం లేదా సమాధి నిర్మాణానికి అనుమతిస్తే అది వ్యక్తిగత ప్రయోజనాలుగా మారి ప్రజా ప్రయోజనాలకు విఘాతం కలిగించి వినాశకరమైన పరిణామాలకు దారి తీస్తుందని ఢిల్లీ హైకోర్టు పేర్కొంది. నిగంబోధ్ ఘాట్‌లోని త్రివేణి ఘాట్‌లోని నాగబాబా భోళా గిరి గుడి ఆస్తులపై హక్కులను గుర్తించేలా జిల్లా మేజిస్ట్రేట్‌ను ఆదేశించాలని కోరుతూ మహంత్ నాగబాబా శంకర్ గిరి తన వారసుడి ద్వారా దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేస్తూ హైకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. ఆ భూమికి సంబంధించిన హక్కు, టైటిల్ వారి పేరు మీద లేదు, ఆ స్థలాన్ని వారిదే అని గుర్తిండానికి ఎలాంటి రికార్డులు లేవు, దానిని ఆక్రమించుకోడానికి పిటిషనర్‌కు ఎలాంటి హక్కు లేదని పేర్కొంటూ పిటిషన్‌ను కొట్టివేసింది.

ఈ సందర్భంగా న్యాయమూర్తి ధర్మేష్ శర్మ మాట్లాడుతూ, మన దేశంలో వేలాది మంది సాధువులు, బాబాలు, ఫకీర్లు లేదా గురువులు వివిధ ప్రాంతాల్లో కనిపిస్తారు. ప్రతి ఒక్కరికి ఒక ప్రభుత్వ స్థలంలో ఒక మందిరాన్ని లేదా సమాధి స్థలాన్ని నిర్మించడానికి అనుమతించినట్లయితే ప్రజా ప్రయోజనాలకు హాని కలిగిస్తుందని అన్నారు. శివ భక్తులైన నాగ సాధువులు ప్రాపంచిక వ్యవహారాల నుండి పూర్తిగా నిర్లిప్త జీవితాన్ని గడపాలని, వారి పేర్లపై ఆస్తి హక్కులు కోరడం అనేది వారిపై ఉన్న నమ్మకాలకు అనుగుణంగా లేదని హైకోర్టు పేర్కొంది.

Advertisement

Next Story

Most Viewed