MiG 29 : కూలిన మిగ్-29 యుద్ధ విమానం.. పైలట్ సేఫ్

by Hajipasha |
MiG 29 : కూలిన మిగ్-29 యుద్ధ విమానం.. పైలట్ సేఫ్
X

దిశ, నేషనల్ బ్యూరో : భారత వాయుసేనకు చెందిన మరో మిగ్ -29 యుద్ధ విమానం కూలిపోయింది. రాజస్థాన్‌లోని బార్మర్ సమీపంలో మిగ్-29లో సాంకేతిక లోపం తలెత్తడంతో క్రాష్ అయింది. అయితే ఆ ఫైటర్ జెట్‌లోని పైలట్ ప్రాణాలతో బయటపడ్డాడు. వాయుసేన యుద్ధ విమానాల పైలట్లు ప్రతిరోజూ రాత్రి శిక్షణ అవసరాల కోసం మిగ్ -29 యుద్ధ విమానాన్ని వినియోగించే వారు.

ఈక్రమంలోనే సోమవారం రాత్రి ఓ పైలట్ శిక్షణ పొందుతుండగా ఈ ఫైటర్‌ జెట్‌ కూలిపోయింది. వెంటనే అప్రమత్తమైన పైలట్ సాహసోపేతంగా వ్యవహరించి యుద్ధ విమానం నుంచి బయటపడ్డాడు. దీంతో అతడి ప్రాణాలు నిలిచాయి.దీనిపై దర్యాప్తునకు వాయుసేన అధికార వర్గాలు ఆదేశాలు జారీ చేశాయి.

Advertisement

Next Story

Most Viewed