- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Astra : ‘అస్త్రా మార్క్ 1’ మిస్సైల్స్ తయారీకి వాయుసేన పచ్చజెండా
దిశ, నేషనల్ బ్యూరో : స్వదేశీ టెక్నాలజీతో మిస్సైళ్ల తయారీ దిశగా భారత్ కీలక ముందడుగు వేసింది. గగన తలం నుంచి గగన తలంలోకి ప్రయోగించే ‘అస్త్రా మార్క్ 1’ రకానికి చెందిన 200 మిస్సైళ్ల తయారీకి ప్రభుత్వరంగ సంస్థ భారత్ డైనమిక్స్ లిమిటెడ్ (బీడీఎల్) కు భారత వాయుసేన పచ్చజెండా ఊపింది. ‘అస్త్రా మార్క్ 1’ మిస్సైళ్లను డీఆర్డీఓ డెవలప్ చేసింది. వీటి ఉత్పత్తికి భారత్ డైనమిక్స్ లిమిటెడ్ ప్రొడక్షన్ ఏజెన్సీగా వ్యవహరించింది. హైదరాబాద్ కేంద్రంగానే బీడీఎల్ కార్యకలాపాలు నిర్వహిస్తుంటుంది. తాజాగా భారత వాయుసేన డిప్యూటీ చీఫ్ ఎయిర్ మార్షల్ అశుతోష్ దీక్షిత్ హైదరాబాద్‌లోని బీడీఎల్‌ను సందర్శించారు.
ఆసందర్భంగానే ‘అస్త్రా మార్క్ 1’ ఉత్పత్తికి అనుమతులను మంజూరు చేసినట్లు భారత వాయుసేన అధికార వర్గాలు తెలిపాయి. వాస్తవానికి రూ.2,900 కోట్లతో ‘అస్త్రా మార్క్ 1 మిస్సైళ్ల డెవలప్‌మెంట్ ప్రాజెక్టుకు 2022-23లోనే రక్షణ శాఖకు చెందిన డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ ఆమోదం తెలిపింది. ఆ మిస్సైల్‌కు సంబంధించిన అన్ని పరీక్షలు పూర్తవడంతో తాజాగా ఇప్పుడు దాని తయారీ ప్రక్రియకు వాయుసేన పచ్చజెండా ఊపింది. రష్యాకు చెందిన సుఖోయ్-30, భారత స్వదేశీ యుద్ధ విమానం తేజస్‌ల నుంచి శత్రు లక్ష్యాలపైకి ప్రయోగించగలిగేలా ‘అస్త్రా మార్క్ 1’ మిస్సైళ్లు ఉంటాయి.