- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నాం: భగవంత్ మాన్
చంఢీగఢ్: అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తైన నేపథ్యంలో పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ సింగ్ మాన్ కీలక వ్యాఖ్యలు చేశారు. తమ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నేరవేర్చడంలో వేగవంతంగా పనిచేస్తుందని చెప్పారు. ప్రజలు తమపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయమని చెప్పారు. ఈ మేరకు పంజాబ్‌లో తమ ప్రభుత్వం ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా గురువారం ఆయన మాట్లాడారు. అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే 300 యూనిట్ల లోపు ఉచిత విద్యుత్, యువతకు ఉద్యోగాలు, మొహల్లా క్లినిక్‌ల ఏర్పాటు వంటివి అమలు చేసిందని చెప్పారు.
ఏడాది కాలంలోనే 26,797 ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించామన్నారు. సుమారు 87 శాతం ఇళ్లకు ఉచిత విద్యుత్ అందిస్తున్నట్లు తెలిపారు. దీంతో పాటు పంటలకు కనీస మద్దతు ధరను అందిస్తుందని అన్నారు. పంజాబ్‌లోని ఆప్ ప్రభుత్వం విద్యార్థుల కోసం ఎమినెన్స్ పాఠశాలలను ప్రారంభిస్తుందని ఆయన అన్నారు. తర్వాతి జనరేషన్ భవిష్యతుకు తగ్గట్లుగా, పేదల జీవన ప్రమాణాన్ని పెంచేందుకు తమ ప్రాధాన్యత అని చెప్పారు.
ప్రజలు తమపై పెట్టుకున్న విశ్వాసాన్ని వమ్ము చేయమని చెప్పారు. అంతేకాకుండా డ్రగ్స్ నియంత్రణకు ప్రభుత్వం అతి పెద్ద కార్యక్రమాన్ని నిర్వహిస్తుందని తెలిపారు. గతేడాది ప్రారంభంలో జరిగిన పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ 117 స్థానాల్లో 92 సీట్లు కైవసం చేసుకుని అనూహ్య విజయం సాధించిన సంగతి తెలిసిందే.