- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నేను మోడీని చంపగలను.. కాంగ్రెస్ చీఫ్
దిశ, వెబ్‌డెస్క్: తాను దేశ ప్రధాని నరేంద్ర మోడీని చంపగలనంటూ కాంగ్రెస్ చీఫ్ చేసిన వ్యాఖ్యలు దేశ రాజకీయాల్లో హీట్ పెంచుతున్నాయి. దేశ ప్రధానిపై మహారాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ నానా పటోలే చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారాయి. ఎన్నికల ప్రచారంలో పటోలే ఇలా వ్యాఖ్యానించడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. అయితే పటోలే భండారా జిల్లాలో లఖానీ తహసీల్ జిల్లా పరిషత్, పంచాయతీ సమితి ఎన్నికలకు ముందు జరిపిన ప్రచార సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేశారు.
'నేను గత 30 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నాను. ఎన్నో మంచి పనులు చేశాను. మోడీని చంపగలను, ధూషించగలను. అందుకే నాకు వ్యతిరేకంగా మోడీనే ప్రచారానికి వచ్చారు' అని పటోలే అన్నారు. పటోలే వ్యాఖ్యలను మహారాష్ట్ర బీజేపీ నేత ఫడ్నవీస్ తీవ్రంగా ఖండించారు. 'ఇటీవల పంజాబ్‌లో ప్రధాని కాన్వాయ్‌ని నిలిపేశారు. ఇప్పుడు ప్రధానిని చంపగలనంటున్నారు. దేశంలో ప్రధాని అంటే గౌరవం లేకుండా పోతోంద'ని ఫడ్నవీస్ అన్నారు. దీంతో ప్రస్తుతం మహరాష్ట్రలో కాంగ్రెస్, బీజేపీ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గు మనేలా పరిస్థితులు మారాయి.