EY Employee's Death: ఈవై ఉద్యోగిని మృతిపై మానవహక్కుల కమిషన్ ఆందోళన

by Shamantha N |
EY Employees Death: ఈవై ఉద్యోగిని మృతిపై మానవహక్కుల కమిషన్ ఆందోళన
X

దిశ, నేషనల్ బ్యూరో: పూణేలో ఎర్నెస్ట్ అండ్ యంగ్ ఇండియా ఉద్యోగిని అన్నా సెబాస్టియన్ మృతిపై మానవ హక్కుల కమిషన్ ఆందోళ వ్యక్తం చేసింది. ఈ కేసులో కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ నుంచి వివరణాత్మక స్పందన కోరింది. ప్రస్తుతం జరుగుతున్న దర్యాప్తు వివరాలతో సహా ఈ కేసుపై సమగ్ర నివేదికను అందించాలని కేంద్రాన్ని కోరింది. అయితే, ఈ విషయాన్ని తమ మంత్రిత్వ శాఖ పరిశీలిస్తోందని కేంద్ర కార్మిక మంత్రి మన్సుఖ్ మాండవియా పేర్కొన్నారు. అసాధ్యమైన లక్ష్యాల కోసం కార్పొరేట్ సంస్థలు మానవ హక్కుల తీవ్ర ఉల్లంఘనలకు పాల్పడుతున్నట్లు ఎన్ హెచ్ఆర్ సీ పేర్కొంది.

ఈవై ఉద్యోగిని మృతి

ఇకపోతే, ఈవైలో పనిచేస్తున్న కొచ్చికి చెందిన అన్నా సెబాస్టియన్‌ ఈ ఏడాది జులై 20న మరణించారు. పుణెలోని సంస్థ కార్యాలయంలో విధుల్లో ఉండగా.. అస్వస్థతకు గురవడంతో సహచరులు ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ అన్నా సెబాస్టియన్ చనిపోయింది. అధిక పనిభారం, తీవ్రమైన పని ఒత్తిడి వల్లే ఆమె చనిపోయిందంటూ అన్నా తల్లి ఆరోపించారు. ఈవై హెడ్ కు ఆమె రాసిన లెటర్ వైరల్ గా మారింది. దీన్ని సీరియస్ గా తీసుకున్న కేంద్రం.. ఈ అంశంపై విచారణ చేపడతామంది.

Next Story

Most Viewed