భారత్‌లో దంచికొడుతున్న ఎండలు.. హాటెస్ట్ సిటిలు ఇవే

by Mahesh |
భారత్‌లో దంచికొడుతున్న ఎండలు.. హాటెస్ట్ సిటిలు ఇవే
X

దిశ, వెబ్‌డెస్క్: దేశంలో ఎండలు దంచికొడుతున్నాయి. దీంతో సాధారణ ప్రజలు ఎండల ప్రతాపానికి విలవిలలాడుతున్నారు. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో నిలువనీడ లేకపోవడంతో ఎండలు మరింతగా మండిపోతున్నాయి. ఒక్క సోమవారం.. గరిష్టంగా 44 డిగ్రీల సెల్సియస్ కంటె ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వాతావరణ శాఖ తెలిపింది. IMD ప్రకారం దేశవ్యాప్తంగా ఉన్న ప్రధాన నగరాల్లో నమోదైన ఉష్ణోగ్రతలు ఈ విధంగా ఉన్నాయి. ఝాన్సీ 46.5°C గరిష్ట ఉష్ణోగ్రతతో అత్యంత వేడిగా ఉండే నగరం, తర్వాత చురు 45.7°C. ఇతర నగరాల్లో ఖజురహో (45.4°C), నౌగాంగ్ (45°C), పాటియాలా (45°C), ఢిల్లీ- రిడ్జ్ (44.9°C), డాల్తోన్‌గంజ్ (44.9°C), కోటా (44.8°C), గ్వాలియర్ (44.8°C) ఉన్నాయి. 44.8°C) గా ఉన్నాయి. ఇదిలా ఉండగా.. కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వాతావరణం కాస్త చల్లబడుతుంది.

Advertisement

Next Story

Most Viewed