సెబీ చైర్‌పర్సన్‌పై హిండెన్‌బర్గ్ తీవ్ర నేరారోపణలు

by M.Rajitha |   ( Updated:2024-08-10 20:57:15.0  )
సెబీ చైర్‌పర్సన్‌పై హిండెన్‌బర్గ్ తీవ్ర నేరారోపణలు
X

దిశ, వెబ్ డెస్క్ : అమెరికాకు చెందిన హిండెన్‌బర్గ్ రీసెర్చ్ సంస్థ మరోసారి సంచలనం సృష్టించింది. అదాని గ్రూప్‌పై తీవ్ర ఆరోపణలు చేసిన ఏడాదిన్నర తర్వాత, ఈసారి సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా(సెబీ) చైర్‌పర్సన్ మాధవి పూరి బుచ్‌పై తీవ్ర ఆరోపణలు చేసింది. హిండెన్‌బర్గ్ ప్రకారం, "అదాని కుంభకోణం"లో ఉపయోగించిన ఆఫ్‌షోర్ నిధుల్లో సెబీ చైర్‌పర్సన్ మరియు ఆమె భర్త ధవల్ బుచ్‌లకు ప్రమేయం ఉందని తెలిపింది. బెర్ముడా మరియు మారిషస్‌లోని రహస్య ఆఫ్‌షోర్ నిధుల్లో వారికి వాటాలు ఉన్నాయని, ఇవి అదాని సోదరుడు వినోద్ అదాని ఉపయోగించినవి అవే నిధులని హిండెన్‌బర్గ్ ఆరోపించింది. కాగా శనివారం ఉదయమే హిండెన్‌బర్గ్ 'ఇండియాకు ఒక పెద్ద న్యూస్ తీసుకు వస్తున్నాం' అని బాంబ్ పేల్చింది.

Advertisement

Next Story

Most Viewed