సంచలనం సృష్టిస్తోన్న హేమంత్ సోరెన్ చేతిపై గుర్తు

by M.Rajitha |
సంచలనం సృష్టిస్తోన్న హేమంత్ సోరెన్ చేతిపై గుర్తు
X

దిశ, వెబ్ డెస్క్ : జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ ఆగస్ట్ 10న తన పుట్టిన రోజు సందర్భంగా ఓ సంచలన ట్వీట్ చేశారు. తన చేతిపై గల గుర్తును సోషల్ మీడియా ద్వారా వెల్లడించి, దానికి సంబంధించిన వివరాలు తెలిపారు. ఇది తాను రాంచీ జైలు నుండి విడుదలైనపుడు అధికారులు వేసిన ఖైదీ అనే ముద్ర అని, ఇది కేవలం ఓ ముద్ర మాత్రమే కాదు.. ప్రస్తుతం దేశంలో నడుస్తున్న అప్రజాస్వామిక పాలనకు గుర్తు అన్నారు. ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నుకోబడిన సీఎంనే ఎలాంటి ఫిర్యాదు, రుజువు లేకుండా 150 రోజులు జైల్లో ఉంచారు. ఒక సీఎంకే ఇలా జరిగితే సామాన్య ప్రజలు, గిరిజనులు, దళితుల పరిస్థితి ఏంటని హేమంత్ సోరెన్ ప్రశ్నించారు. తాను దేశంలోని అప్రజాస్వామిక పరిస్థితులపై న్యాయ పోరాటం చేస్తానని, దోపిడీకి గురవుతున్న అణగారిన వర్గాల, గిరిజనుల, దళితుల హక్కుల కోసం ముందు నిలబడతానని అన్నారు. వారి సంస్కృతి, గుర్తింపు, జీవన విధానం మీద జరుగుతున్న దాడులను ఎదుర్కోవాల్సిన అవసరం చాలా ఉందని సోరెన్ వ్యాఖ్యానించారు.

అయితే మనీలాండరింగ్ కేసులో ఈడీ హేమంత్ సోరెన్ ను అరెస్ట్ చేయగా.. 150 రోజులు రాంచీ జైలులో ఉన్నారు. జైలులో ఉన్నప్పుడు సోరెన్ తన సీఎం పదవికి రాజీనామా చేయగా, జైలు నుండి విడుదలయ్యాక మళ్ళీ బాధ్యతలు స్వీకరించారు.

Next Story

Most Viewed