- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
కోర్టు ఆర్డర్.. మాజీ సీఎంకు 22 వరకు జ్యుడీషియల్ కస్టడీ
దిశ, నేషనల్ బ్యూరో : భూ కుంభకోణంతో ముడిపడిన మనీలాండరింగ్ కేసులో జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్‌ను ఫిబ్రవరి 22 వరకు జ్యుడీషియల్ కస్టడీకి అప్పగిస్తూ ప్రత్యేక పీఎంఎల్‌ఏ కోర్టు గురువారం ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఇప్పటివరకు ఈడీ కస్టడీలో ఉన్న హేమంత్‌ను జ్యుడీషియల్ కస్టడీకి తరలించనున్నారు. రాంచీలోని హోత్వార్‌లో ఉన్న బిర్సా ముండా సెంట్రల్ జైలులో ఆయన జ్యుడీషియల్ కస్టడీలో ఉంటారు. హేమంత్ సోరెన్‌ను క్యాంపు జైలుకు తరలించాలని కోరుతూ ఏదైనా దరఖాస్తు చేస్తారా అని జార్ఖండ్ అడ్వకేట్ జనరల్ రాజీవ్ రంజన్‌ను మీడియా ప్రశ్నించగా.. ప్రస్తుతానికి జైలు శిక్ష విషయంలో ప్రత్యేక హక్కును క్లెయిమ్ చేయడం లేదని స్పష్టం చేశారు.‘క్యాంప్ జైలు’ అనేది జైలు క్యాంపస్‌లో ప్రమాదకరమైనదిగా పరిగణించబడని ఖైదీలను ఉంచే ప్రదేశం. త్వరలోనే తాము హేమంత్ తరఫున బెయిల్ పిటిషన్‌ను దాఖలు చేస్తామని రాజీవ్ రంజన్ వెల్లడించారు. హేమంత్ సోరెన్‌కు రిమాండ్ గడువును పొడిగించాలని ఈడీ కోరలేదని ఆయన తెలిపారు. మనీలాండరింగ్ కేసులో జనవరి 31న రాత్రి హేమంత్‌ను ఈడీ అరెస్టు చేసింది. కోర్టు తొలుత ఫిబ్రవరి 2న హేమంత్ సోరెన్‌కు ఐదు రోజుల ఈడీ కస్టడీని విధించింది. ఆ తర్వాత ఈడీ కస్టడీ గడువును రెండదఫాల్లో మరో వారం రోజుల పాటు పొడిగించింది.