- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
Heavy Rains: ముంబైలో మరిన్ని భారీ వర్షాలు..హెచ్చరికలు జారీచేసిన ఐఎండీ
దిశ, నేషనల్ బ్యూరో: ఇప్పటికే భారీ వర్షాలతో అతలాకుతలం అవుతున్న ముంబైలో రాబోయే నాలుగైదు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) వెల్లడించింది. వరుసగా మూడు రోజులుగా 100 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదు కాగా..శనివారం, ఆదివారం మధ్యలో 24 గంటల్లో 93 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్టు అంచనా వేసింది. ఈ వర్షాలు మరిన్ని రోజులు పాటు కొనసాగనున్నట్టు పేర్కొంది. ఈ నేపథ్యంలో ముంబై నగరానికి మూడు రోజుల పాటు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. మరోవైపు ఆదివారం ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల మధ్య ట్రాంబేలోని షాహాజీ నగర్‌లో 155.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని బృహన్‌ముంబై మునిసిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) తెలిపింది.
ఈ పరిణామాలపై సీఎం ఏక్ నాథ్ షిండే స్పందించారు. మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు అవసరమైనప్పుడు పౌరులకు అన్ని విధాలుగా సహాయం చేయడానికి అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు రాబోయే ఐదు రోజుల్లో తూర్పు రాజస్థాన్, హర్యానా, చండీగఢ్, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్‌లో ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది. హిమాచల్ ప్రదేశ్‌లో మాత్రం సోమ, మంగళవారాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. అలాగే బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో ఒడిశాలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.