- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆ వివరాలను బహిర్గతం చేయలేం: సుప్రీంకోర్టు
దిశ, డైనమిక్ బ్యూరో: సమాచార హక్కు చట్టం కింద ఉన్నత న్యాయస్థానాల్లో న్యాయమూర్తుల నియామకాలపై కొలిజియం సమావేశాల్లోని చర్చల వివరాలను వెల్లడించాలంటూ దాఖలైన పిటిషిన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. కొలిజియం వివరాలను బహిర్గతం చేయలేమని ధర్మాసనం స్పష్టం చేసింది. 2018 డిసెంబర్ 12వ తేదీన ఇద్దరు న్యాయమూర్తుల నియామకం కోసం జరిగిన కొలీజియం సమావేశంలో వివరాలను వెల్లడించాలని కోరుతూ సామాజిక కార్యకర్త అంజలీ భరద్వాజ్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో శుక్రవారం విచారణ జరిపిస ధర్మాసనం 'కొలీజియం సమావేశంలో ఏం చర్చించుకున్నా వాటిని ప్రజలకు బహిర్గతం చేయలేం. కేవలం ఆ సమావేశం తుది నిర్ణయాన్ని మాత్రమే వెల్లడిస్తాం'అని పేర్కొంది.
గతంలో జరిగిన సమావేశంలో పాల్గొన్న ఓ జడ్జి ఇచ్చిన ఇంటర్వ్యూ ఆధారంగా వెలువడ్డ కథనాలపై పిటిషనర్ ఆధారపడ్డారని కోర్టు పేర్కొంది. ఈ ఆంశంపై మరోసారి వ్యాఖ్యానించదల్చుకోలేదని సుప్రీం స్పష్టం చేసింది. ఈ పిటిషన్‌లో పసలేదని తెలిపింది. దీనిని కొట్టివేస్తున్నట్లు న్యాయస్థానం ప్రకటించింది. కాగా, అంజలీ భరద్వాజ్ తొలుత ఆర్టీఐ చట్టం కింద కొలీజియం వివరాలు కోరగా అధికారులు ఇచ్చేందుకు నిరాకరించారు. దీంతో ఆ నిర్ణయాన్ని సవాలు చేస్తూ ఆమె న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. 2018 డిసెంబర్ 12వ తేదీ నాటి కొలీజియం సమావేశంలో సీజేఐ రంజన్ గొగోయ్, జస్టిస్ మదన్ బి లోకూర్, జస్టిస్ ఏకే సిక్రీ, జస్టిస్ ఎస్‌ఏ బోబ్డే, జస్టిస్ ఎన్వీ రమణ పాల్గొన్నారు. కానీ, అప్పట్లో ఈ భేటీ వివరాలను సుప్రీంకోర్టు వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయలేదు.