- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Meerut murder: గుడ్డిగా ప్రేమించాడు.. మా బిడ్డకు ఉరి పడాల్సిందే.. మీరట్ మర్డర్ కేసు నిందితురాలి తల్లిదండ్రులు

దిశ, నేషనల్ బ్యూరో : దిశ, నేషనల్ బ్యూరో: ప్రియుడి మోజులో పడిన భార్య.. భర్తను హత్య చేసింది. సినిమా తరహాలోనే భర్తను చంపింది. తొలుత నిద్రమాత్రలు ఇచ్చి.. ఆ తర్వాత కత్తితో పొడిచి చంపింది. మృతదేహాన్ని 15 ముక్కలుగా నరికి ప్లాస్టిక్ డ్రమ్ములో వేశారు. అంతటితో ఆగకుండా దానిపై సిమెంట్ పోసి మూర్తిగా మూసేశారు. ఉత్తరపదేశ్ లోని మీరట్ లో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. బ్రహ్మపురి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇందిరానగర్ లో నేవీ అధికారిని భార్య అతికిరాతంగా కడతేర్చింది. ఈ కేసులో భార్యని, ఆమె ప్రియుడ్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మార్చి 4న వ్యక్తి హత్య జరగగా.. దాదాపు 15 రోజుల తర్వాత విషయం వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మీరట్‌కు చెందిన సౌరభ్ రాజ్‌పుత్ మర్చంట్ నేవీ అధికారి. 2016లో ఆయన ముస్కాన్ రస్తోగిని ప్రేమ వివాహం చేసుకున్నాడు. 2019లో వారికి ఒక పాప జన్మించింది. ఆ తర్వాత ముస్కాన్.. సాహిల్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. విషయం సౌరభ్‌కు తెలియడంతో భార్యాభర్తల మధ్య గొడవలు జరిగాయి. ఆఖరికి ఇద్దరూ విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. కానీ తన ఐదేళ్ల కుమార్తె భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని సౌరభ్ తన నిర్ణయాన్ని మార్చుకున్నాడు. ముస్కాన్‌తో వివాహం తర్వాత సౌరభ్ నేవీ ఉద్యోగాన్ని కూడా వదిలేశారు. అయితే, సౌరభ్ తల్లిదండ్రుల ఇంట్లో ముస్కాన్ గొడవలు సృష్టించడంతో ఆమెతో వేరు కాపురం పెట్టాడు. ఆ తర్వాత సౌరభ్ స్నేహితుడు సాహిల్ తో వివాహేతర సంబంధం పెట్టుకుంది. భర్త ఎంత చెప్పినా వినలేదు. విడాకులు ఇస్తానని బెదిరించాడు. కానీ, చిన్నారి భవిష్యత్ దృష్టా ఆ పని చేయలేదు. తిరిగి నేవీ ఉద్యోగంలో చేరాడు. ఉద్యోగరీత్యా విదేశాలకు వెళ్లిన సౌరభ్ కుమార్తె పుట్టిన రోజు కోసం తిరిగి భారత్ వచ్చాడు. ఈ క్రమంలో మార్చి 4న రాత్రి సౌరభ్‌కు భోజనంలో నిద్రమాత్రలు కలిపి పెట్టింది. అతడు నిద్రలోకి జారుకున్న తర్వాత ప్రియుడు సాహిల్‌ను పిలిచి హత్యకు పాల్పడింది.
సౌరభ్ కన్పించకపోవడంతో ఫిర్యాదు..
అయితే, చాలా రోజులుగా సౌరభ్ కనిపించకపోవడంతో అనుమానం పెరిగింది. అతని కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ముస్కాన్, సాహిల్ ని విచారించగా విషయం వెలుగులోకి వచ్చింది. హత్య గురించి సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే చర్యలు తీసుకున్నారని మీరట్ ఎస్పీ సిటీ ఆయుష్ విక్రమ్ తెలిపారు. ముస్కాన్ తన నేరాన్ని అంగీకరించి, తన ప్రేమికుడు సాహిల్‌తో కలిసి సౌరభ్‌ను హత్య చేశానని చెప్పింది. పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని తనిఖీ చేయగా ప్లాస్టిక్ డ్రమ్ కనిపించింది. అయితే డెడ్ బాడీని కప్పిపెట్టి సిమెంట్ పోయడంతో బిగుసుకుపోయింది. అతికష్టం మీద డ్రమ్ ను కత్తిరించి మృతదేహాన్ని బయటకు తీశారు. పోలీసులు మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం పంపి, నిందితులిద్దరిపై హత్య కేసు నమోదు చేశారు.
ముస్కాన్ తల్లిదండ్రులు
ముస్కాన్ తల్లిదండ్రులు తమ బిడ్డ చేసింది క్షమించరాని నేరమని మీడియా ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. సౌరభ్ ఆమెను గుడ్డిగా ప్రేమించాడని, ఆమె ఏది అడిగినా కాదనే వాడు కాదని చెప్పారు. ఆమె కోసం ఉద్యోగం వదిలేశాడని, కుటుంబాన్ని వదిలేశాడని తెలిపారు. సాహిల్‌తో సంబంధం గురించి తెలిసినా తనను మార్చుకునే ప్రయత్నం చేశాడే తప్ప.. తొందరపడలేదని అన్నారు. ఉద్యోగం కోసం సౌరభ్ లండన్ వెళ్తుంటే ఆయన తిరిగి వచ్చేవరకు ముస్కాన్‌ను తమతో ఉండమని కోరామని, అందుకు ముస్కాన్ నిరాకరించిందని చెప్పారు. అప్పుడు కూడా ముస్కాన్ నే సౌరభ్ సమర్థించాడని ఆమె తల్లిదండ్రులు చెప్పుకొచ్చారు. సాహిల్ మాయలో, డ్రగ్స్ ఉచ్చులో పడి కిరాతకంగా వ్యవహరించిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంత దారుణానికి పాల్పడిన మీ కుమార్తెకు ఏం శిక్ష పడాలని కోరుకుంటున్నారని మీడియా ప్రశ్నించగా.. ఉరే సరైన శిక్ష అని చెప్పి కంటతడిపెట్టారు. పెళ్లి జరిగినప్పటి నుంచి తమ కుమార్తె సౌరభ్‌ను ఇబ్బందులకు గురిచేస్తూ వచ్చిందని చెప్పారు. ఈ విషయంలో న్యాయం జరిగే వరకు తాము కూడా సౌరభ్ కుటుంబానికి అండగా ఉంటామని అన్నారు.
Read More..
వీళ్లు మామూలు దొంగలు కాదుగా.. ఏకంగా పోలీస్ స్టేషన్ లోనే చోరీ..