- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఎన్నికల వేళ గవర్నర్ దత్తాత్రేయ కీలక ఆదేశం
దిశ, నేషనల్ బ్యూరో : హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ కీలక ఆదేశం జారీ చేశారు. రాష్ట్రంలోని కైతాల్ జిల్లాకు చెందిన అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్ (ఏఆర్వో), సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్ బ్రహ్మం ప్రకాశ్‌పై ఆయన సస్పెన్షన్ వేటు విధించారు. కైతాల్ జిల్లాలో రెండు ఎన్నికల ర్యాలీలను నిర్వహించడానికి అనుమతి కోరుతూ ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థి ఒకరు ఎన్నికల కమిషన్ పోర్టల్ ద్వారా దరఖాస్తు సమర్పించారు. దీనికి బదులిస్తూ పంపిన సందేశంలో కంప్యూటర్ ఆపరేటర్లు అసభ్య పదజాలాన్ని ఉపయోగించారు. అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్ ఐడీ నుంచి ఈ మెసేజ్‌లు ఆప్ అభ్యర్థికి వెళ్లాయి. దీనిపై ఆమ్ ఆద్మీ పార్టీ ఫిర్యాదు చేయడంతో రాష్ట్ర గవర్నర్ బండారు దత్తాత్రేయ స్పందించారు. ఆ మెసేజ్‌లో అనుచిత పదజాలం ఉందని తేలడంతో అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్ బ్రహ్మం ప్రకాశ్‌ను సస్పెండ్ చేశారు. ఇక అంతకుముందు ఈ తప్పుడు మెసేజ్‌కు కారకులైన తన కార్యాలయంలోని ఐదుగురు కంప్యూటర్ ఆపరేటర్లను అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్ బ్రహ్మం ప్రకాశ్ సస్పెండ్ చేశారు.