Haryana Elections: కాంగ్రెస్‌తో కుదరని పొత్తు.. హర్యానాలో ఆప్ తొలి జాబితా రిలీజ్!

by vinod kumar |
Haryana Elections: కాంగ్రెస్‌తో కుదరని పొత్తు.. హర్యానాలో ఆప్ తొలి జాబితా రిలీజ్!
X

దిశ, నేషనల్ బ్యూరో: హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)ల మధ్య పొత్తు కుదరనట్టు తెలుస్తోంది. సీట్ షేరింగ్ పై స్పష్టత రాకపోవడంతో ఆప్ 20 మంది అభ్యర్థులతో సోమవారం తొలి జాబితా విడుదల చేసింది. కాంగ్రెస్ ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించిన స్థానాల్లోనూ 11 మంది పేర్లను ఖరారు చేసింది. త్వరలోనే రెండో లిస్ట్ విడుదల చేస్తామని ఆప్ హర్యానా అధ్యక్షుడు సుశీల్ గుప్తా తెలిపారు. దీంతో రెండు పార్టీల మధ్య పొత్తు ముగిసిందని పలువురు భావిస్తున్నారు. అంతకుముందు సుశీల్ గుప్తా మాట్లాడుతూ సాయంత్రంలోగా ఒప్పందం ఖరారు కాకపోతే మొత్తం 90 స్థానాల నుండి తమ పార్టీ అభ్యర్థుల పేర్లను విడుదల చేస్తామని చెప్పారు. ఈ నేపథ్యంలోనే మొదటి లిస్ట్ ఖరారు చేశారు. కాగా, ఆప్ 10 సీట్లు డిమాండ్ చేయగా అందుకు కాంగ్రెస్ అంగీకరించనట్టు తెలుస్తోంది. కేవలం 5 సీట్లు మాత్రమే ఇచ్చేందుకు సిద్ధమైంది. ఈ కారణంగానే పొత్తు విచ్ఛిన్నమైనట్టు సమాచారం.

Advertisement

Next Story

Most Viewed