ECI : ఎన్నికల సంసిద్ధతపై హర్యానాలో సీఈసీ సమీక్ష

by Hajipasha |
ECI : ఎన్నికల సంసిద్ధతపై హర్యానాలో సీఈసీ సమీక్ష
X

దిశ, నేేషనల్ బ్యూరో : త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న హర్యానా రాష్ట్రంలో చీఫ్ ఎలక్షన్ కమిషనర్ (సీఈసీ) సారథ్యంలోని కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) ప్రతినిధుల బృందం సోమవారం పర్యటించింది. ఈసందర్భంగా ఎన్నికల సంసిద్ధతపై చండీగఢ్‌‌లో సీఈసీ సమీక్షించారు. ఈ సమావేశాల్లో కేంద్ర ఎన్నికల కమిషనర్లు జ్ఞానేశ్ కుమార్, ఎస్ఎస్ సంధు కూడా పాల్గొన్నారు. 90 మంది ఎమ్మెల్యేలు ఉన్న హర్యానా అసెంబ్లీ పాలనా కాలం ఈ ఏడాది నవంబరు 3తో ముగియనుంది. ఈ ఏడాది చివర్లోగా అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న మొత్తం 8 రాష్ట్రాల్లో హర్యానా కూడా ఉంది.

హర్యానాలో జరగబోయే ఎన్నికల్లో ఇండియన్ నేషనల్ లోక్‌దళ్ (ఐఎన్‌ఎల్‌డీ), బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) కలిసి పోటీచేయనున్నాయి. ఆమ్ ఆద్మీ పార్టీ ఒంటరిగానే బరిలోకి దిగనుంది. 2019లో హర్యానాలో జరిగిన అసెంబ్లీ పోల్స్‌లో బీజేపీ 40 సీట్లు, కాంగ్రెస్ 31 సీట్లు, జేజేపీ 10 సీట్లు, ఐఎన్‌ఎల్‌డీ 1 సీటు గెలిచాయి.

Advertisement

Next Story

Most Viewed