- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
Ayodhya Museum : అయోధ్య మ్యూజియంలో హనుమాన్ గ్యాలరీ.. ప్రత్యేకతలివీ
దిశ, నేషనల్ బ్యూరో : అయోధ్యలో నవ్య భవ్య రామమందిరం తర్వాత తప్పకుండా సందర్శించాల్సిన ప్రదేశం రామ కథా మ్యూజియం. వాస్తవానికి అంతకుముందు దీనిపేరు రామకథా సంగ్రహాలయం. రామమందిర నిర్మాణం మొదలైన తర్వాత దీని పేరును రామ కథా మ్యూజియంగా మార్చారు. ఆర్టిఫీషియల్ ఇంటెలీజెన్స్, వర్చువల్ రియాలిటీ తదితర అత్యాధునిక సాంకేతికతల మేళవింపుగా దీన్ని తయారు చేయిస్తున్నారు. 2025 సంవత్సరం చివరికల్లా దాదాపు 40వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ మ్యూజియం సిద్ధం కానుంది. కొత్తగా వచ్చిన అప్‌డేట్ ఏమిటంటే.. రామ కథా మ్యూజియంలో హనుమంతుడికి ప్రత్యేక గ్యాలరీని ఏర్పాటు చేయనున్నారు.
హనుమంతుడితో ముడిపడిన రామాయణ ఘట్టాలను కలిపి 20 నిమిషాల నిడివి కలిగిన ఒక లఘుచిత్రాన్ని రెడీ చేయించారు. దాన్ని సందర్శకులు 3డీతో పాటు 7డీ టెక్నాలజీలో చూసేందుకు మ్యూజియంలోని హనుమాన్ గ్యాలరీలో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ఈవివరాలను అయోధ్య రామమందిర ట్రస్టు అధికార వర్గాలు వెల్లడించాయి. ఐఐటీ చెన్నైకు చెందిన నిపుణుల సహకారంతో 3డీ, 7డీ టెక్నాలజీల్లో చూసేలా ఈ సినిమాను రూపొందించినట్లు తెలిపాయి. ఒక్కో సెషనులో హనుమాన్ గ్యాలరీని 25 మంది విజిట్ చేయొచ్చని పేర్కొన్నారు.