Govt Debt: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ. 185 లక్షల కోట్లకు కేంద్రం అప్పు

by S Gopi |
Govt Debt: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ. 185 లక్షల కోట్లకు కేంద్రం అప్పు
X

దిశ, నేషనల్ బ్యూరో: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కేంద్రం అప్పు రూ. 185 లక్షల కోట్లకు చేరుతుందని ప్రభుత్వం అంచనా వేసింది. ఇది ప్రస్తుత మారకపు రేటు, బహిరంగ రుణాలు, విదేశీ రుణాలతో కలుపుకుని దేశ జీడీపీలో ఈ మొత్తం 56.8 శాతానికి చేరనుందని అభిప్రాయపడింది. ఈ ఏడాది మార్చి ఆఖరు నాటికి మొత్తం రూ. 171.78 లక్షల కోట్లు అంటే జీడీపీలో 58.2 శాతంగా ఉందని ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరీ సోమవారం లోక్‌సభకు లిఖితపూర్వక సమాధానంలో తెలిపారు. అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ ఐఎంఎఫ్ వరల్డ్ ఎకనమిక్ ఔట్‌లుక్ ప్రకారం, ప్రస్తుత ధరల ప్రకారం, 2024 ఏప్రిల్ నాటికి భారత జీడీపీ 3.57 ట్రిలియన్ డాలర్లకు చేరుకుందని ఆయన పేర్కొన్నారు. మరో ప్రశ్నకు సమాధానమిస్తూ.. 2022-23, 2023-24లో స్థిర ధరల వద్ద ప్రై ప్రైవేట్ తుది వినియోగ వ్యయం వృద్ధి రేటు వరుసగా 6.8 శాతం, 4 శాతంగా ఉందని చెప్పారు. మరో ప్రశ్నకు సమాధానంగా పంకజ్ చౌదరి.. 15వ ఆర్థిక సంఘం సిఫార్సు చేసిన ప్రకారం 2021-22కి రాష్ట్రాల సాధారణ నికర రుణ పరిమితి (ఎన్‌బీసీ) స్థూల రాష్ట్ర దేశీయోత్పత్తి (జీఎస్‌డీపీ)లో 4 శాతంగా ఉందన్నారు. అలాగే.. 2015, డిసెంబర్ నాటి ఆధ్రప్రదేశ్ పునర్‌వ్యవస్థీకరణ చట్టం కింద ఏపీకి చెందిన వెనుకబడిన ఏడు జిల్లాలకు రూ. 2,100 కోట్లు సాయం అందించాలని నీతి ఆయోగ్ సూచించినట్టు పంకజ్ చౌదరీ బదులిచ్చారు. ఒక్కో జిల్లాకు రూ. 300 కోట్ల చొప్పున కేటాయింపు ప్రతిపాదన ఉందని వెల్లడించారు.

Advertisement

Next Story

Most Viewed