Gaurav Gogoi: గౌరవ్ గొగోయ్‌కు షాక్.. ఆయన భార్య ఎలిజబెత్‌పై దర్యాప్తు షురూ!

by vinod kumar |
Gaurav Gogoi: గౌరవ్ గొగోయ్‌కు షాక్.. ఆయన భార్య ఎలిజబెత్‌పై దర్యాప్తు షురూ!
X

దిశ, నేషనల్ బ్యూరో: ఉగ్రవాద సంస్థ ఐఎస్ఐతో సంబంధాలున్నాయనే ఆరోపణలతో పాక్ పౌరుడు అలీ తౌకీర్ షేక్ (Ali Tauqeer Sheikh) పై అసోంలో చట్టవిరుద్ధ కార్యకలాపాల (నివారణ) చట్టం, 1967 (UAPA) కింద ఈ నెల18న కేసు నమోదైన విషయం తెలిసిందే. ఆయన 18 సార్లు భారతదేశాన్ని సందర్శించినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. అయితే ఆయనతో కాంగ్రెస్ నేత గౌరవ్ గొగోయ్ (Gaurav Gogoi) భార్య ఎలిజబెత్ గొగోయ్‌ (Elebizeth gogoi) టచ్ లో ఉన్నట్టు ఆరోపణలున్నాయి. దీంతో ఈ అంశంపై ఆరా తీసేందుకు అసోం పోలీసుల ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) ఢిల్లీకి చేరుకుంది. తౌకీర్ షేక్ తన ఢిల్లీ పర్యటనల టైంలో ఎలిజబెత్‌తో ఏమైనా సంభాషించారా అనే సమాచారాన్ని తెలుసుకునేందుకు పరిశోధన బృందం దర్యాప్తు చేపడుతోంది.

ఢిల్లీలో తౌకీర్‌కు చెందిన ఎన్జీఓ కార్యకలాపాల వివరాలను కూడా సేకరిస్తున్నారు. అలాగే ఎలిజబెత్ పాస్‌పోర్ట్, వీసా, ఇతర సంబంధిత పత్రాలను కూడా పరిశీలించనున్నారు. కాగా, ఎలిజబెత్ 2011-2015 మధ్య క్లైమేట్ డెవలప్‌మెంట్ అండ్ నాలెడ్జ్ నెట్‌వర్క్ (CDKN)లో పనిచేశారు. ఆ టైంలో ఆమె ఎక్కువగా పాకిస్తాన్‌లోనే ఉంది. అయితే ఆమెపై ఇప్పటివరకు ఎటువంటి అభియోగాలు మోపబడలేదు. మరోవైపు గౌరవ్ గొగోయ్ భార్యకు ఐఎస్ఐతో సంబంధాలున్నాయని అసోం సీఎం హిమంత బిస్వశర్మ (Himanth biswa sharma) ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే.

Next Story

Most Viewed