- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
PM Modi : గణపయ్యనూ కటకటాల వెనక్కి నెడతారా ?.. కర్ణాటకలోని కాంగ్రెస్ సర్కారుపై ప్రధాని మోడీ ఫైర్
దిశ, నేషనల్ బ్యూరో : కర్ణాటకలోని కాంగ్రెస్ సర్కారుపై ప్రధానమంత్రి నరేంద్రమోడీ నిప్పులు చెరిగారు. ‘‘బుజ్జగింపు రాజకీయాలకు అలవడిన హస్తం పార్టీ ప్రభుత్వం ఎలాంటి స్థితికి చేరిందంటే.. చివరకు గణపతిని కూడా కటకటాల వెనక్కి నెట్టేందుకు బరితెగించింది’’ అని ఆయన మండిపడ్డారు. ఈనెల 11న కర్ణాటకలోని నాగమంగళ పట్టణంలో గణపతి నిమజ్జనం సందర్భంగా లంబోదరుడి విగ్రహాన్ని పోలీసు వ్యానులో ఉంచారు. ఆ ఘటనపై స్పందిస్తూ ప్రధాని మోడీ తాజా వ్యాఖ్యలు చేశారు.
శనివారం హర్యానాలోని కురుక్షేత్రలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో ఆయన ప్రసంగించారు. ‘‘యావత్ దేశం గణేశ్ ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించుకుంటోంది. అయితే ఆ ఉత్సవాలకు కాంగ్రెస్ అడ్డుతగులుతోంది. ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ పాతది కాదు. అది అర్బన్ నక్సల్స్‌కు కొత్తరూపంగా మారింది. అబద్ధాలు చెప్పేందుకు కాంగ్రెస్ అస్సలు వెనుకాడటం లేదు’’ అని ప్రధాని మోడీ వ్యాఖ్యానించారు.