ఆట ఇంకా ఆరంభం కాలేదు.. నితీశ్ జంపింగ్‌పై తేజస్వి కీలక వ్యాఖ్య

by Hajipasha |
ఆట ఇంకా ఆరంభం కాలేదు.. నితీశ్ జంపింగ్‌పై తేజస్వి కీలక వ్యాఖ్య
X

దిశ, నేషనల్ బ్యూరో : బిహార్‌లోని మహాకూటమికి సీఎం నితీశ్ కుమార్ గుడ్‌బై చెప్పిన నేపథ్యంలో డిప్యూటీ సీఎం, ఆర్జేడీ అగ్రనేత తేజస్వియాదవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘నితీశ్ కుమార్ గౌరవనీయుడే.. కానీ ఆయన కంట్రోల్‌లో కూడా లేని అంశాలు అనేకం చుట్టూ ఉన్నాయి. మహాకూటమిలో ఉన్నన్ని నాళ్లు నితీశ్‌ను మేమంతా ఎంతో గౌరవించాం’’ అని చెప్పారు. లాలూ ప్రసాద్ యాదవ్, రబ్రీదేవి సహా ఆర్జేడీ కీలక నేతలతో శనివారం పాట్నాలోని తమ నివాసంలో నిర్వహించిన అత్యవసర సమావేశంలో తేజస్వియాదవ్ మాట్లాడారు. మహా కూటమి నుంచి నితీశ్‌ కుమార్ ప్లేటు ఫిరాయింపుపై స్పందిస్తూ.. ‘‘బిహార్‌లో అసలు ఆట ఇంకా ప్రారంభం కాలేదు’’ అని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో అనేక అనూహ్య పరిణామాలు జరగొచ్చన్నారు. బిహార్‌లో సర్కారు ఏర్పాటుకు 122 మంది ఎమ్మెల్యేల బలం అవసరం. అయితే ఇప్పుడు జేడీయూ వైదొలగడంతో మహా కూటమి వద్ద 114 మంది సభ్యులే ఉన్నారు. స్వతంత్రులు, పలువురు జేడీయూ ఎమ్మెల్యేల అండతో ప్రభుత్వం ఏర్పాటుకు లాలూ స్కెచ్ వేస్తున్నట్లు మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఈనేపథ్యంలో ఇప్పుడు లాలూ కుమారుడు తేజస్వి చేసిన కామెంట్స్ ప్రాధాన్యాన్ని సంతరించుకున్నాయి.

Advertisement

Next Story