- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
G7 leaders: యుద్ధంలో శాంతిని నెలకొల్పే బాధ్యత రష్యాదే.. జీ7 దేశాలు
దిశ, నేషనల్ బ్యూరో: ఉక్రెయిన్(Ukrein)తో యుద్ధాన్ని ముగించి శాంతిని నెలకొల్పే బాధ్యత రష్యా (Russia) దేనని గ్రూప్ ఆఫ్ సెవన్ (G7) కూటమి దేశాలు తెలిపాయి. ప్రస్తుతం కొనసాగుతున్న ఘర్షణకు శాంతియుతంగా న్యాయమైన పరిష్కారాన్ని చూపేందుకు రష్యా అడ్డంకిగా మారిందని పేర్కొన్నాయి. రష్యా దాడికి పాల్పడి 1000 రోజులు అవుతున్న సందర్భంగా జీ7 దేశాలు శనివారం సంయుక్తంగా ఓ ప్రకటన విడుదల చేశాయి. ఉక్రెయిన్‌పై దాడి చేసినందుకు నిరసనగా ఎగుమతి, ఇతర చర్యల ద్వారా రష్యాపై ఆంక్షలు విధిస్తూనే ఉంటామని స్పష్టం చేశారు. తాము ఉక్రెయిన్‌కు మద్దతిస్తామని తెలిపారు. సార్వభౌమత్వం, స్వేచ్ఛ, స్వాతంత్ర్యం, ప్రాదేశిక సమగ్రత, దాని పునర్నిర్మాణం కోసం కీవ్‌కు సంఘీభావంగా నిలుస్తామని వెల్లడించారు. ప్రపంచ వ్యాప్తంగా హాని కలిగించే రష్యా దూకుడు స్వభావాన్ని గుర్తించామని తెలిపారు. ఈ ప్రయత్నాలను వెంటనే మానుకోవాలని సూచించారు. కాగా, జీ7 కూటమిలో కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, బ్రిటన్, అమెరికాలు సభ్యత్వ దేశాలుగా ఉన్నాయి. ప్రస్తుతం ఈ కూటమికి ఇటలీ చైర్ పర్సన్‌గా ఉంది.