France: ఫ్రాన్స్‌లో కూలిపోయిన ప్రభుత్వం.. త్వరలో ప్రధాని రాజీనామా!

by vinod kumar |
France: ఫ్రాన్స్‌లో కూలిపోయిన ప్రభుత్వం.. త్వరలో ప్రధాని రాజీనామా!
X

దిశ, నేషనల్ బ్యూరో: ఫ్రాన్స్‌(France)లో మరోసారి రాజకీయ సంక్షోభం నెలకొంది. ప్రధాని మిచెల్ బార్నియర్ (Michel Barnier) ప్రభుత్వం అవిశ్వాస తీర్మానంలో ఓడిపోయింది. బార్నియర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వామపక్ష పార్టీ నేషనల్ అసెంబ్లీ (National Assembly)లో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టింది. ఈ ప్రతిపాదనకు మారైన్ లె పెన్ నేతృత్వంలోని ఫార్ రైట్ నేషనల్ పార్టీ మద్దతు తెలిపింది. అనంతరం ఓటింగ్ నిర్వహించగా 577 మంది సభ్యులకు గాను బార్నియర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా 331 ఓట్లు వచ్చాయి. దీంతో ప్రభుత్వం పడిపోయింది. 60 ఏళ్ల ఫ్రాన్స్ చరిత్రలో అవిశ్వాస తీర్మానం నెగ్గడం ఇదే తొలిసారి. ఈ పరిణామాల నేపథ్యంలో బార్నియర్ తన పదవికి త్వరలోనే రాజీనామా చేయనున్నట్టు తెలుస్తోంది. బార్నియర్ మూడు నెలల క్రితమే ప్రధానిగా బాధ్యతలు చేపట్టాడు.

కాగా, ఈ ఏడాది జూతైలోనే ఫ్రాన్స్‌లో సాధారణ ఎన్నికలు జరిగాయి. ఈ ఎలక్షన్స్‌లో ఏ పార్టీకీ మెజారిటీ రాకపోవడంతో మెరైన్ లే పెన్ పార్టీ మద్దతుతో బార్నియర్ సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. అయితే బార్నియర్ ప్రతిపాదించిన బడ్జెట్‌తో ఆయనపై తీవ్ర వ్యతిరేకత పెరిగింది. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం పడిపోవడం గమనార్హం. అవిశ్వాస తీర్మానం తర్వాత ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ కొత్త ప్రధానమంత్రిని నియమించే పనిలో నిమగ్నమైనట్టు సమాచారం. త్వరలోనే ఆయన దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నట్టు తెలుస్తోంది. అయితే మాక్రాన్ సైతం రిజైన్ చేయాలని పలు పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి.

Next Story

Most Viewed