ప్రధాని మోడీతో మాజీ ప్రధాని భేటీ

by GSrikanth |
ప్రధాని మోడీతో మాజీ ప్రధాని భేటీ
X

దిశ, డైనమిక్ బ్యూరో: ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని జేడీఎస్‌ అధినేత, మాజీ ప్రధాన మంత్రి దేవెగౌడ కలిశారు. దేవెగౌడ ఇద్దరు కుమారులు కుమార స్వామి, రేవణ్ణతో కలిసి ఇవాళ ఢిల్లీలో మోడీతో భేటీ అయ్యారు. ఈ నేపథ్యంలోనే ప్రధాని మోడీ ట్విట్టర్ (ఎక్స్) వేదికగా పంచుకున్నారు. వారిని కలవడం ఎంతో ఆనందంగా ఉందని మోడీ పేర్కొన్నారు. దేశ ప్రగతికి మాజీ ప్రధాని దేవెగౌడ చేసిన కృషిని ఆయన కొనియాడారు. కాగా, ఇటీవలే ఎన్డీఏ కూటమితో జేడీఎస్‌ పొత్తుపెట్టుకున్న విషయం తెలిసిందే.

Advertisement

Next Story

Most Viewed