- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
EX MLA Weeps: బీజేపీ అధిష్టానం షాక్ ... బోరున ఏడ్చిన బీజేపీ మాజీ ఎమ్మెల్యే
దిశ, డైనమిక్ బ్యూరో: బీజేపీ అధిష్టానం తనకు టికెట్ నిరాకరించడంతో హర్యానాకు చెందిన మాజీ ఎమ్మెల్యే శశిరంజన్ పర్మార్ బోరున విలపించారు. తన పేరు పరిశీలనలో ఉంచారని ప్రజలకు చెప్పుకుటూ వచ్చాను. ఇప్పుడు నేనేం చేయాలంటూ ఓ ఇంటర్వ్యూలో దుఃఖాన్ని ఆపుకోలేక గుక్కపట్టి ఏడ్డారు. 90 స్థానాలు ఉన్న హర్యానా అసెంబ్లీకి అక్టోబర్ 5వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో పార్టీలు అభ్యర్థులను ప్రకటిస్తున్నాయి. ఈ క్రమంలో బివానీ లేదా తోషామ్ నియోజకవర్గాలలో ఏదో ఒక చోట అవకాశం కోసం ఆశలు పెట్టుకున్న మాజీ ఎమ్మెల్యే శశిరంజన్ పర్మార్ కు షాక్ తగిలింది. ఆయనకు పార్టీ టికెట్ నిరాకరించింది. ఆయన ఆశించిన స్థానాలలో ఇతరులను అభ్యర్థులుగా ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఓ న్యూస్ చానెల్ కుఇంటర్వ్యూ ఇస్తూ.. అభ్యర్థుల జాబితాలో తన పేరు లేకపోవడంతో ఆవేదనకు గురయ్యారు. తానిప్పుడు నిస్సాహాయుడిగా మారానంటూ కన్నీరు పెట్టుకున్నారు. రిపోర్టర్ ఎంత సముదాయించినా దుఃకాన్ని ఆపుకోలేక బోరున విలపించారు. కాగా హర్యానాలో అక్టోబర్ 5న ఎన్నికలు జరగనుండగా, అక్టోబర్ 8న ఓట్ల లెక్కింపు జరగనుంది.