- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కాంగ్రెస్‌లో చేరిన బీజేపీ మాజీ సీఎం జగదీష్ షెట్టర్
దిశ, వెబ్‌డెస్క్: కర్ణాటక మాజీ సీఎం జగదీశ్ షెట్టర్‌కు బీజేపీ టికెట్ కేటాయించకపోవడంతో ఆయన బీజేపీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో అతను పోటిలో తప్పకుండా ఉంటానని స్పష్టం చేశారు. కానీ ఈ రోజు ఉదయం కాంగ్రెస్ పార్టీలో చేరారు. బెంగళూరులోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో.. ఆ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ కాంగ్రెస్ నేతలు రణదీప్ సూర్జేవాలా, సిద్ధరామయ్య సమక్షంలో కర్ణాటక మాజీ సీఎం జగదీశ్ శెట్టర్ కాంగ్రెస్‌లో చేరారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీనియర్ నాయకుడినైన తనకు బీజేపీ టికెట్ ఇస్తుందని భావించాను. కానీ తనకు టికెట్ రాలేదు. ఈ విషయం తెలియగానే షాక్ కు గురయ్యానని ఆవేదన వ్యక్తం చేశారు. టికెట్ విషయంలో ఎవరూ తనతో చర్చించలేదని, ఒప్పించే ప్రయత్నమూ చేయలేదన్నారు. కర్ణాటకలో పార్టీ ఎదుగుదల కోసం కృషి చేసిన తన పట్ల బీజేపీ అధిష్టానం దారుణంగా ప్రవర్తించిందన్నారు. కాంగ్రెస్ సిద్ధాంతాలు పనితీరు నచ్చే పార్టీలో చేరుతున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఖర్గే మాట్లాడుతూ శెట్టర్ వివాదారహితుడని ఆయన చేరిక కాంగ్రెస్ పార్టీలో కొత్త ఉత్సాహాన్ని తీసుకువస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కాగా టికెట్ దక్కని నేతలు బీజేపీని వీడి ఇతర పార్టీల్లో చేరుతుండటం కర్ణాటక కమలం పార్టీలో సంచలనంగా మారుతోంది.