కీలక పరిణామం.. ఐదుగురు ఎమ్మెల్యేలతో బీజేపీలోకి ఝార్ఖండ్ మాజీ సీఎం

by Mahesh |
కీలక పరిణామం.. ఐదుగురు ఎమ్మెల్యేలతో బీజేపీలోకి ఝార్ఖండ్ మాజీ సీఎం
X

దిశ, వెబ్ డెస్క్: జాతీయ రాజకీయాలతో పాటు, ఝార్ఖండ్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకోనున్నట్లు తెలుస్తోంది. ఆ రాష్ట్ర ప్రస్తుతం సీఎం హేమంత్ సోరెన్ మనీలాండరింగ్ కేసులో అరెస్ట్ అయ్యారు. దీంతో ఆయన తన సీఎం పదవికి రాజీనామా చేయగా..జేఎంఎం ఎమ్మెల్యే చంపై సోరెన్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే బెయిల్ పై జైలు నుంచి హేమంత్ సోరెన్ విడుదల కావడంతో చంపై సోరెన్ సీఎం పదవికి రాజీనామా చేశారు. అనంతరం హేమంత్ సోరెన్ సీఎంగా బాధ్యతలు తీసుకున్నారు. అప్పటి నుంచి జేఎంఎం పార్టీకి చంపై సోరెన్ కాస్త దూరంగా ఉంటున్నారు. ఈ క్రమంలోనే ఆయన బీజేపీలో చేరేందుకు సిద్ధం అయినట్లు తెలుస్తుంది. చంపై సోరెన్ మరో ముగ్గురు ఎమ్మెల్యేలతో కలిసి ఢిల్లికి చేరుకున్నారు. కాగా మొత్తం ఐదుగురు ఎమ్మెల్యేలతో చంపై సోరెన్ ఈ రోజు కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమక్షంలో ఆయన బీజేపీలో చేరుతున్నట్లు తెలుస్తుంది.

Advertisement

Next Story