- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Banks : ఇక నుంచి వారంలో రెండు రోజుల సెలవులు..
దిశ, వెబ్‌డెస్క్: భారత్‌లోని అనేక ప్రభుత్వం, ప్రైవేట్ సెక్టార్ లోని కార్యాలయాల్లో పనిచేసే ఉద్యోగులకు ఆదివారం మాత్రమే సెలవు ఉంటుంది. కానీ కొన్ని ప్రముఖ సాఫ్ట్‌వేర్ కంపేనీల్లో మాత్రం డబుల్ వికెండ్, శని, ఆదివారం రెండు రోజులు ఉంటుంది. అయితే గత కొంత కాలంగా బ్యాంకు ఉద్యోగులు కూడా తమకు ఈ తరహాలోనే వారంలో ఐదు రోజు పనిదినాలు ఉండేలా చూడాలని కేంద్ర ప్రభుత్వాన్ని అనేకసార్లు రిక్వెస్ట్ చేశారు. దీంతో బ్యాంకు ఉద్యోగుల శ్రమ, వారిపై పడే ఒత్తిడిని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. వారంలో ఐదు రోజుల పనిదినాలు ఈ సంవత్సర నుంచి అమలయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
దీనికి ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపితే జూన్ నెల నుంచి అమల్లోకి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. బ్యాంకు ఉద్యోగుల పని దినాలు తగ్గితే కష్టమర్లు ఇబ్బంది పడే అవకాశం ఉందని కొందరు చెబుతున్న క్రమంలో.. పని దినాలు తగ్గినప్పటికీ కస్టమర్లకు అందించే పని గంటలు తగ్గవని, వాటిలో ఎలాంటి మార్పులు ఉండవని యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ ఎంప్లాయీస్ కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ కు రాసిన లేఖలో స్పష్టం చేశారు. దీంతో పనిదినాల తగ్గింపుతో పాటు జీతాల పెంపుపై కూడా కేంద్రం త్వరలో ప్రకటన చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.