ట్రంప్ పై కాల్పులు జరిపిన నిందితుడి ఫొటో విడుదల

by Shamantha N |   ( Updated:2024-07-15 06:17:11.0  )
ట్రంప్ పై కాల్పులు జరిపిన నిందితుడి ఫొటో విడుదల
X

దిశ, నేషనల్ బ్యూరో: అమెరికా మాజీ అద్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై కాల్పుల ఘటనలో నిందితుడి ఫొటోను ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్ బీఐ) విడుదల చేసింది. నిందితుడ్ని 20 ఏళ్ల థామస్ మాథ్యూ క్రూక్స్ గా గుర్తించింది. జులై 13న పెన్సిల్వేనియాలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తుండగా ట్రంప్ పై కాల్పులు జరిగాయి. ట్రంప్ పై పలు రౌండ్ల కాల్పులు జరిపిన తర్వాత క్రూక్స్ ను సీక్రెట్ సర్వీస్ స్నిపర్లు కాల్చి చంపారు. కాగా.. క్రూక్స్ పెన్సిల్వేనియాలోని బెతెల్ పార్క్ కు చెందిన వ్యక్తి అని ఎఫ్ బీఐ పేర్కొంది. ఇప్పుడు అతడి ఫొటోను విడుదల చేసింది. క్రూక్స్ అద్దాలు పెట్టుకుని నవ్వుతున్నట్లు ఆ ఫొటోలో ఉంది. అతని డెడ్ బాడీ దగ్గర ఒక రైఫిక్ ఏఆర్-15 ని అధికారులు గుర్తించారు.

క్రూక్స్ ఎవరంటే?

థామస్ మాథ్యూ క్రూక్స్ గురించి ఆసక్తికర విషయాలు బయటకొస్తున్నాయి. బెతెల్ పార్క్ నుంచి అతడు హైస్కూల్ పూర్తి చేసినట్లు అధికారులు పేర్కొన్నారు. నేషనల్ మాథ్ అండ్ సైన్స్ ఇనిషియేటివ్ నుంచి 500 డాలర్ల స్టార్ అవార్డు కూడా అందుకున్నట్లు వివరించారు. క్రూక్స్ ఒంటరిగా, సైలంట్ గా ఉండేవాడని అతడి క్లాస్ మేట్స్ తెలిపారు. అతను ఎప్పుడూ రాజకీయాలు లేదా ట్రంప్ గురించి చర్చించలేదని పేర్కొన్నారు. కానీ, స్కూల్ లో తరచుగా బెదిరిపులకు గురయ్యాడని వివరించారు. క్రూక్స్ తీవ్రమైన వేధింపులకు గురయినట్లు అతడి క్లాస్ మేట్స్ తెలిపారు. గ్రాడ్యుయేషన్ పూర్తి చేసినప్పట్నుంచి అతను నర్సింగ్ హోమ్‌లో పని చేస్తున్నట్లు చెప్పారు. మరోవైపు, అధికారులు అతని ఫోన్ ను స్వాధీనం చేసుకుని వివరాలను సేకరిస్తున్నారు. కాల్పుల ఘటన తర్వాత అతడి కారు నుంచి అనుమానాస్పద వస్తువును అధికారులు గుర్తించారు. దాన్ని తనిఖీ చేస్తున్నారు. ఇకపోతే, నవంబర్ 5న జరిగే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో క్రూక్స్ ఓటు వేయడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.

Advertisement

Next Story

Most Viewed