వన్ నేషన్ వన్ ఎలక్షన్‌కు ‘ఫిక్కీ’ మద్దతు: కోవింద్ కమిటీకి తెలిపిన ప్రతినిధులు

by samatah |
వన్ నేషన్ వన్ ఎలక్షన్‌కు ‘ఫిక్కీ’ మద్దతు: కోవింద్ కమిటీకి తెలిపిన ప్రతినిధులు
X

దిశ, నేషనల్ బ్యూరో: దేశంలో ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలన్న ప్రతిపాదనకు ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ (ఫిక్కీ) మద్దతు ఇచ్చింది. ఈ మేరకు మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నేతృత్వంలోని ఉన్నత స్థాయి కమిటీతో ఫిక్కి ప్రతినిధులు సమావేశమయ్యారు. వారి అభిప్రాయాలను కమిటీకి లిఖిత పూర్వకంగా అందజేయంతో పాటు ఈ అంశంపై ప్రజెంటేషన్ ఇచ్చారు. వన్ నేషన్ వన్ ఎలక్షన్‌కు పూర్తి మద్దతు ఇస్తున్నట్టు తెలిపారు. ఎందుకంటే పదే పదే ఎన్నికలు నిర్వహించడం వల్ల వ్యాపార కార్యకలాపాలు సైతం ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కొంటాయని చెప్పారు. సరైన నిర్ణయాలు తీసుకోవడంతో సమస్యలు ఎదురవుతాయని వెల్లడించారు. అంతేగాక ఒకే సారి ఎన్నికలు జరపడం వల్ల ఆదా అయ్యే ఖర్చును ప్రజల జీవనోపాధిని మెరుగుపర్చేందుకు ఉపయోగించొచ్చని సూచించారు. కోవింద్ కమిటీతో భేటీ అయిన వారిలో ఫిక్కి అధ్యక్షుడు అనిష్ షా, వైస్ ప్రెసిడెంట్ అనంత్ గోయెంకా, హర్షవర్ధన్ అగర్వాల్, ఎస్కే పాఠక్, జ్యోతి విజ్, అన్షుమాన్ ఖన్నాలు ఉన్నారు. గతవారం కోవింద్ కమిటీ కాన్ఫడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ(సీఐఐ) ప్రతినిధులతో సమావేశమై అభిప్రాయాలను తీసుకుంది.

ఎస్పీ నేతల భేటీ

సమాజ్ వాదీ పార్టీ(ఎస్పీ) నేతలు కూడా కూడా రామ్ నాధ్ కోవింద్ ప్యానెల్‌తో భేటీ అయ్యారు. వారి అభిప్రాయాలను కమిటీకి లిఖిత పూర్వకంగా అందజేశారు. ఎన్నికల సంఘం సామర్థ్యాన్ని పరిక్షించేందుకు, ఈ అంశంపై ప్రజాభిప్రాయాన్ని తెలుసుకునేందుకు ఉత్తరప్రదేశ్‌లో ఓ కార్యక్రమాన్ని చేపట్టాలని ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ గతంలో సూచించారు. కాగా, ఒకే దేశం-ఒకే ఎన్నికపై అధ్యయనానికి భారత మాజీ రాష్ట్రపతి కోవిండ్ నేతృత్వంలో కేంద్రం కమిటీని ఏర్పాటు చేసిన తెలిసిందే. ఈ క్రమంలోనే కమిటీ సంప్రదింపుల ప్రక్రియ ప్రారంభించింది. దీనికి సంబంధించి ప్రజల అభిప్రాయాలను సైతం కమిటీ కోరింది.

Advertisement

Next Story

Most Viewed